English | Telugu

సహనటుడిపై రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేసిన కమెడియన్‌!

ఈమధ్యకాలంలో సినిమా రంగంలో కోర్టు, వివాదాలు, పరువు నష్టం దావాలు, వివిధ నేరారోపణలు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కేసు కోర్టు వరకు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైన తమిళ హాస్యనటుడు వడివేలు. 35 సంవత్సరాలుగా ఎన్నో డబ్బింగ్‌ సినిమాల ద్వారా తన హాస్యంతో అలరించిన ఆయన ఇప్పుడు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. తన సహనటుడు, మిత్రుడు అయిన సింగముత్తుపై రూ.5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు వడివేలు.

వడివేలు చేసిన ఫిర్యాదులో ఏముందంటే.. తాను 1991 నుంచి నటుడిగా కొనసాగుతున్నానని తెలిపారు. 2000 సంవత్సరం నుంచి సహనటుడు సింగముత్తుతో కలిసి కొన్ని సినిమాలు చేశానని పేర్కొన్నారు వడివేలు. అయితే అతని కంటే తనకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావడం సింగముత్తు సహించలేకపోతున్నాడని, అందుకే తనపై పలు ఆరోపణలు చేస్తున్నాడని వివరించారు. తాంబరంలోని ఓ స్థలం ఎగ్మోర్‌ కోర్టులో వివాదంలో ఉంది. దాన్ని తనతో కొనిపించాడని తెలిపారు. అంతేకాకుండా, కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌లో సింగముత్తు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అబద్దాలు ప్రచారం చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని ఆరోపించారు వడివేలు. అతని నుంచి తనకు రూ.5 కోట్లు పరువు నష్టాన్ని ఇప్పించాలని కోర్టును కోరారు. వడివేలు పిటిషన్‌ను స్వీకరించిన చెన్నయ్‌ హైకోర్టు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సింగముత్తుకి నోటీసులు జారీ చేసింది. వీరిద్దరి వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుందో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.