English | Telugu

బ్లాక్ బస్టర్ ‘‘రాయన్ ’’ఇక ఓటిటి లో చూసేయండి..ఎక్కడ చూడొచ్చంటే


తమిళ అగ్రహీరోల్లో ఒకడైన ధనుష్(dhanush)నుంచి గత నెల జులై 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ రాయన్(raayan)పాన్ ఇండియా లెవల్లో విడుదలవ్వగా అన్ని చోట్ల మంచి విజయాన్నే అందుకుంది. సన్ పిక్చర్స్ పై కళానిది మారన్ నిర్మించగా ధనుషే రచనా దర్శకత్వం అందించాడు. పైగా స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ లైబ్రరీ లో కూడా చోటు సంపాదించింది. దీన్ని బట్టి రాయన్ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రేంజ్ సరికొత్త రూపాన్ని సంపాదించుకుంది.


ప్రముఖ ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో రాయన్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అగస్ట్ 23 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ మేరకు అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది దీంతో ఓటిటి సినీ ప్రేమికుల్లో పండుగ వాతావరణంరావడంతో పాటుగా ఎప్పుడెప్పుడు మూవీని చూస్తామా అనే క్యూరియాసిటీ కూడా ఉంది. ఇక రాయన్ ధనుష్ కెరీర్ లో 50 వ సినిమాగా వచ్చింది.

ఫ్యామిలీ అండ్ రివెంజ్ డ్రామా గా వచ్చిన రాయన్ లో , ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం లు అన్నదమ్ములుగా చెయ్యగా చెల్లెలిగా దుషారా విజయన్ చేసింది. ఈ నలుగురి పెర్ఫార్మెన్సు మూవీకి హైలెట్ గా నిలిచింది. అలాగే ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, వరలక్ష్మి శరత్ కుమార్ లు పవర్ ఫుల్ పాత్రల్లో మెరిశారు.మూవీలో ఎన్నో ట్విస్టులు కూడా ఉన్నాయి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.