English | Telugu

మెగాస్టార్ ఇంటి ముందు అభిమానుల ధర్నా

మెగాస్టార్ ఇంటి ముందు అభిమానుల ధర్నా చేశారు. వివరాల్లోకి వెళితే ఇటీవల మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి "ఇక మీదట నేను పూర్తిస్థాయి రాజకీయాల్లోనే ఉంటూ ప్రజా సేవ చేస్తాను. సినిమాల్లో నటించను" అని అన్నారు. ఈ స్టేట్ మెంట్ అశేషంగా ఉన్న మెగాభిమానులను బాగా కలవరపరిచింది. మొన్నటి వరకూ మెగాస్టార్ నటించబోయే 150 వ సినిమాకి ఆయన కుమారుడూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరిస్తారనీ, ఆ సినిమా కథ కూడా సిద్ధమయ్యిందనీ వినపడింది. ఉన్నట్టుండి చిరంజీవి "సినిమాల్లో నటించను" అనగానే అభిమానులకు ఆ మాట శరాఘాతంలా తగిలింది.

దాంతో మెగా స్టార్ అభిమానులు జూన్ 30 వ తేదీన, మెగాస్టార్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. "అన్నయ్యా ఒక్క సినిమా" అంటు వారు నినదించారు. అప్పుడే అటుగా వచ్చిన మెగా బ్రదర్ నాగబాబుని ఈ విషయమై అన్నయ్య చిరంజీవికి నచ్చచెప్పాల్సిందిగా వారు ఆయన్ని కోరారు. అందుకాయన స్పందిస్తూ " నేను మీలాగే అన్నయ్య అభిమానిని. మా అబ్బాయ్ రామ్ చరణ్ నేను ఈ విషయమై అన్నయ్యతో మాట్లాడాలనుకుంటున్నాం. కనీసం 150 వ నిమా అయినా చేయ్యాలని అన్నయ్యను గట్టిగా అడగాలనుకుంటున్నాం. నాకు ఒక రెండు రోజులు టైమిస్తే అన్నయ్యతో ఈ విషయమై మాట్లాడి అన్నయ్య కనీసం ఒక్క సినిమాలోనైనా నటించేలా వొప్పించటానికి ప్రయత్నిస్తాను" అని వారికి హామీ ఇచ్చారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.