English | Telugu

నిన్న ఎన్టీఆర్, నేడు చరణ్.. తెలుగు హీరోల అరుదైన ఘనత

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. రాజమౌళి ఏ ముహూర్తాన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ప్రారంభించారో కానీ.. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా పేరు మారుమోగిపోతోంది. ఎందరో హాలీవుడ్ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ కి ఫిదా అయ్యారు. అలాగే 'నాటు నాటు' పాట ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలిచింది. అలాగే ఎన్టీఆర్ ఇటీవల ఆస్కార్స్(ది అకాడమీ) యొక్క యాక్టర్స్ బ్రాంచ్ లో స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఘనత సాధించిన నటుల లిస్టులో చరణ్ కూడా చేరాడు.

ఆస్కార్స్ ఇటీవల యాక్టర్స్ బ్రాంచ్ లోకి కొంతమంది కొత్త సభ్యులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆ యాక్టర్స్ బ్రాంచ్ లో ఇప్పటికే ఎన్టీఆర్ స్థానం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ లిస్టులో చరణ్ కి కూడా చోటు లభించింది. సినిమాల పరంగా ఆస్కార్స్ ని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులుగా భావిస్తారు. అలాంటి ఆస్కార్స్ యాక్టర్స్ బ్రాంచ్ లో తెలుగు హీరోలు ఎన్టీఆర్, చరణ్ చోటు దక్కించుకోవడం గొప్ప విషయమే. దీంతో ఎన్టీఆర్, చరణ్ తో పాటు వారికి గ్లోబల్ ఇమేజ్ రావడానికి కారణమైన రాజమౌళిపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.