English | Telugu
చిరంజీవి లేటెస్ట్ ట్వీట్ వైరల్.. ఆ సినిమాని ఉద్దేశించే చెప్పాడా లేక వేరేనా
Updated : Dec 13, 2025
-చిరు ట్వీట్ లో ఏముంది
-సంక్రాంతికి వస్తున్నాడు
-ఆ సినిమాలో ఏముంది
-అద్భుతమైన సంవత్సరం ఇది
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ప్రస్తుతం 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ తో పాటు ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉండటంతో మూవీ గ్యారంటీ హిట్ అనే నమ్మకం అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఏర్పడింది. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపిస్తుండటం కూడా వాళ్ళ నమ్మకానికి కొండంత అండ. అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకుడు కావడం మరో ఆకర్షణ.
ఇక ఈ రోజు విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు. 64 సంవత్సరాలు పూర్తి చేసుకొని 65 వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు.ఈ సందర్భంగా చిరంజీవి 'ఎక్స్'(X)వేదికగా స్పందిస్తు 'నా ప్రియమైన వెంకీ మామకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎక్కడికి వెళ్లినా పాజిటివిటీ, ఆప్యాయత తీసుకొస్తారు. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ సమయంలో మనం కలిసి గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఎంతో ఆదరిస్తాను. మీకు ఆనందంతో, ఆశీర్వాదాలతో నిండిన మరో అద్భుతమైన సంవత్సరం కలగాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఈ ట్వీట్ ఇద్దరి అభిమానులని, నెటిజన్స్ ని ఆకర్షించడమే కాకుండా చిరంజీవి, వెంకటేష్ మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటి చెప్పింది. మన శంకర వర ప్రసాద్ గారు షూటింగ్ కి సంబంధించి వెంకటేష్ తో దిగిన ఫోటోని కూడా చిరంజీవి షేర్ చెయ్యడం జరిగింది. ఇక చిరంజీవి వెంకీ మామ అనే వర్డ్ ని ఉపయోగించడంతో మన శంకర వర ప్రసాద్ గారు లోని వెంకటేష్ క్యారక్టర్ పేరుని 'వెంకిమామ' అని మళ్ళీ రిపీట్ చేస్తున్నారా లేక చిరంజీవి క్యాజువల్ గా అన్నాడా అనే డౌట్ ని కూడా కొంత మంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
Also read:Akhanda 2 .. ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్
వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వెంకీ మామ వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి చాలా మంది వెంకటేష్ ని వెంకీ మామ అని పిలవడం అలవాటయ్యింది. వెంకటేష్ రీసెంట్ గా త్రివిక్రమ్(Trivikram)దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్ 47 'అనే మూవీ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.