English | Telugu
Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్
Updated : Dec 13, 2025
-రికార్డు కలెక్షన్స్
-బాలయ్య జోరు
-పాజిటివ్ రెస్పాన్స్ అదనపు బలం
-వీకెండ్ లో ఎంత!
గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. మేకర్స్ కూడా ఈ కలెక్షన్స్ ని అధికారకంగా తెలపడంతో పాటు 'అఖండ భారత్ బ్లాక్ బస్టర్' అంటు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ రికార్డు కలెక్షన్స్ పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ ట్రేడ్ వర్గాలు కూడా ఈ కలెక్షన్స్ పై స్పందిస్తు 'తొలి రోజే బాలయ్య 59 కోట్ల రూపాయలు దాకా సాధించడం చూస్తుంటే ఈ వీకెండ్ కి 100 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారంటీ. పైగా సంక్రాంతి వరకు ఎలాంటి పెద్ద తెలుగు సినిమాలు లేవు. టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది.
Also read: రాజు వెడ్స్ రాంబాయి ఓటిటి డేట్ ఫిక్స్! మరి ఫ్యాన్స్ ఏమంటున్నారు
దీంతో బాలయ్య అఖండ 2 తో తన కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని చెప్తున్నారు.దీంతో అఖండ 2 సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. బాలయ్య గత చిత్రం 'డాకు మహారాజ్' వరల్డ్ వైడ్ గా 56 కోట్ల గ్రాస్ ని అందుకున్న విషయం తెలిసిందే.