English | Telugu

సజ్జనార్ తో చిరంజీవి, నాగార్జున భేటీ.. అభిమానుల్లో పండుగ వాతావరణం     

-చిరంజీవి, నాగార్జున ఏం చెప్పబోతున్నారు
-సజ్జనార్ తో భేటీ
-అభిమానులు హ్యాపీ
-ఐ బొమ్మ మైండ్ బ్లాక్

పైరసీతో తెలుగు సినిమాని భయబ్రాంతులకి గురి చేస్తున్న ఐబొమ్మ(Ibomma)నిర్వాహకుడు రవిని శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రవిని కస్టడీ కి తీసుకొని మరింతగా విచారణ జరపడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక రవి అరెస్ట్ తో అయితే తెలుగు సినిమాతో పాటు సినీ ప్రతినిధుల్లో పండుగ వాతారవరణం వచ్చిందని చెప్పవచ్చు.


రీసెంట్ గా రవి అరెస్ట్ విషయంపై మాట్లాడటానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),కింగ్ నాగార్జున(Nagarjuna)సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్(Vc Sajjanar)తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాల గురించి ఆ ఇద్దరు సజ్జనార్ తో చర్చించనున్నారు . పూర్తి వివరాలు భేటీ అనంతరం బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయి. పైరసీ పై సుదీర్ఘ కాలంగా చిత్ర పరిశ్రమ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

also read: సిద్దార్ధ్ వైఫ్ అదితిరావుహైదరీ పేరుపై మెసేజెస్.. నమ్మచ్చా!


ఇక ఇప్పటికే రవికి సంబంధించిన ల్యాప్‌టాప్‌లు, వెబ్‌ లాగిన్‌లు, సర్వర్‌ వివరాలకి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ తో పాటు మరో సైట్ బెప్పం టీవీ లని క్లోజ్‌ చేయించారు. రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందల హార్డ్‌డిస్క్‌లను పరిశీలనకి పంపడంతో పాటు ఇప్పటివరకు అతను అక్రమంగా సంపాదిచిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాన్నీ కూడా పరిశీలించడంతో పాటు రవి వెనక ఇంకెవరైనా ఉన్నారా అని కూడా ఆరాతీస్తున్నారు.



పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.