English | Telugu

ఇండియాలోనే నెంబర్‌ వన్‌ ‘చికిరి చికిరి’ సాంగ్‌.. కొత్త రికార్డు క్రియేట్‌ చేసిన చరణ్‌!

- వ్యూస్‌లో కొత్త రికార్డు

- చరణ్, జాన్వీ స్టెప్స్‌కి ఫ్యాన్స్ ఫిదా

- చరణ్ బర్త్ డే కానుకగా పెద్ది రిలీజ్

రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట ‘చికిరి.. చికిరి..’ని విడుదల చేశారు మేకర్స్‌. ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా మోహిత్‌ చౌహాన్‌ పాడారు. చరణ్‌, జాన్వీ కపూర్‌లపై చిత్రీకరించిన ఈ పాటకు జానీ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. డీసెంట్‌ స్టెప్స్‌తో సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. తమిళ్‌లో ఈ పాటను ఎ.ఆర్‌.రెహమాన్‌ ఆలపించడం విశేషం.

ఇదిలా ఉంటే.. ‘చికిరి చికిరి’ సాంగ్‌ ఓ కొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. పాట విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 46 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. అలాగే ఈ పాటకు 13 గంటల్లో 32 మిలియన్‌ వ్యూస్‌ లభించాయి. గతంలో ఓ పాట 24 గంటల్లో 32 మిలియన్‌ సాధించి రికార్డు సృష్టించింది. దాన్ని క్రాస్‌ చేస్తూ ‘చికిరి చికిరి’ సాంగ్‌ 46 మిలియన్‌ వ్యూస్‌ రాబట్టి ఇండియాలోనే నెంబర్‌ వన్‌ సాంగ్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ పాటలోని స్టెప్స్‌పై చర్చ మొదలైంది. చరణ్‌, జాన్వీ వేసిన స్టెప్పుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అలాగే ఎ.ఆర్‌.రెహమాన్‌ చాలా కాలం తర్వాత తెలుగులో చేసిన సినిమా కావడం కూడా సోషల్‌ మీడియాలో చర్చకు కారణంగా కనిపిస్తోంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం