English | Telugu

ఫైనల్ గా విజయ్ దేవరకొండ పేరును రివీల్ చేసిన రష్మిక!

జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకి వచ్చిన రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పేరును రివీల్ చేసింది. జగపతి అడిగిన కొన్న ప్రశ్నల్లో ఆమె అతని పేరు చెప్పింది. ఇంతకు ఏం అడిగారో చూద్దాం.

"జిమ్ నా ఔట్లెట్.. మీకెప్పుడైనా నన్ను కలుసుకోవాలంటే జిమ్ కి వచ్చేయండి.. మీరు నాతో పరిగెత్తొచ్చు, నడవొచ్చు, చాలా టైం కూడా స్పెండ్ చేయొచ్చు.. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి.. మంచిగా తినండి, వర్కౌట్ చేయండి, మీ బ్రెయిన్, మీ హార్ట్, మీ బాడీ చాలా ఇంపార్టెంట్ " అని చెప్పింది రష్మిక.

"జిమ్ కి వచ్చేయండి అని చెప్పడం తేలిక..ఏ జిమ్ ఏ టైం అని చెప్పాలి కదా" అని జగపతి బాబు ఆడియన్స్ తో అన్నారు. "బొంబాయికి వస్తే జెడబ్ల్యు హోటల్ లో ఉంటా. హైదరాబాద్ లో 3 జిమ్స్ ఉన్నాయి. వాటి పేర్లు చెప్తే తిడతారు. రౌడీ జిమ్ అని స్టార్ట్ చేయాలి. పేరు కూడా బాగుంది కదా. అక్కడికి వచ్చేయండి నేనే ట్రైన్ చేస్తా మిమ్మల్ని." అని చెప్పింది.

ఇక వేలికి ఉన్న ఉంగరాలు చూసి "ఆ రింగ్స్ ఏమన్నా సెంటిమెంటా" అని కూడా అడిగారు. "సెంటిమెంట్ సర్. పచ్చ ఉంగరం ఆస్ట్రాలజీ పరంగా బాగుంటుంది అన్నారు. పెట్టుకున్నాను. ఇంకోటి స్టైలింగ్ కోసం. ఇక ఈ మెర్క్యూరీ రింగ్ ఒక స్పెషల్ గిఫ్ట్" అని చెప్పింది.

"డియర్ కామ్రేడ్ నీ ఫేవరేట్ ఫిలిం కదా దానికి రీజన్ ఏమన్నా ఉందా" అని అడగగా.. " ఆ టైములో అలాంటి స్క్రిప్ట్ రావడం క్రికెటర్ అయ్యి క్రికెట్ నేర్చుకోవడం చేసాను. ఇప్పటికీ ఆ మూవీ గురించి మెసేజెస్ వస్తాయి. అలాగే గీత గోవిందం తర్వాత వెంటనే మళ్ళీ విజయ్ తో ఈ మూవీ చేయడం చాలా స్పెషల్ నాకు. అలాగే మా జోడి కూడా జనాలు ప్రేమించడం మొదలు పెట్టారు. ఈ రెండు మూవీస్ డిఫెరెంట్ కాన్సెప్ట్స్. కానీ డియర్ కామ్రేడ్ బెస్ట్ మ్యూజిక్ ఆల్బంగా జనాల్లోకి వెళ్ళింది. నా పెర్ఫార్మెన్స్ కూడా ఆ మూవీలో బాగా కనిపిస్తుంది." అని చెప్పింది.

"నీ వార్డ్ రోబ్ లో ఉండే ఎక్స్పెన్సివ్ థింగ్ ఏమిటి" అని అడిగారు. "ఒక స్పెషల్ పర్సన్ గిఫ్ట్ చేసిన ఈ మెర్క్యూరీ రింగ్" అని చెప్పింది. తర్వాత "ఫాషన్ అడ్వైస్ తీసుకోవాలంటే ఏ యాక్టర్ దగ్గర నుంచి తీసుకుంటావ్" అని అడిగారు. "ఒక్కటే పేరొస్తుంది సర్. విజయ్ దేవరకొండ దగ్గర నుంచి" అని చెప్పింది రష్మిక.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .