English | Telugu

కట్టిపడేస్తున్న 'చెల్లి వినవే' పాట!

సంగీత దర్శకుడిగా, నటుడిగా తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా నటించిన 'బిచ్చగాడు' సినిమా తెలుగులో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం బిచ్చగాడిగా మారిన ఓ ధనువంతుడి కథతో రూపొందిన ఈ చిత్రం 2016 మార్చిలో విడుదలై ఊహించని విజయాన్ని అందుకుంది. ఆకట్టుకునే కథాకథనాలతో పాటు, విజయ్ ఆంటోని సంగీతం కూడా సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ముఖ్యంగా 'వంద దేవుళ్ళే కలిసొచ్చిన' అంటూ సాగే అమ్మ పాట ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు చెల్లి సెంటిమెంట్ తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు విజయ్ ఆంటోని.

2016 లో 'బిచ్చగాడు'తో ఆకట్టుకున్న విజయ్.. ఏడేళ్ల తర్వాత 'బిచ్చగాడు-2'తో వస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు, సంగీత దర్శకుడు ఆయనే కావడం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి 'చెల్లి వినవే' అంటూ సాగే వీడియో సాంగ్ విడుదలైంది. విజయ్ స్వరపరిచిన ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. భాష్యశ్రీ సాహిత్యం, అనురాగ్ కులకర్ణి గాత్రం కట్టిపడేస్తున్నాయి. "చెల్లి వినవే, నా తల్లి వినవే.. నీ అన్నను కాను, అమ్మే నేను" అంటూ సాగే పాట ఎంతో హృద్యంగా ఉంది. వీడియో సాంగ్ లో అన్నాచెల్లెళ్లుగా చైల్డ్ ఆర్టిస్ట్ లు మాదేష్, శివణ్య కనిపించారు. స్కూల్ కి వెళ్లాల్సిన వయసులో వారి తల్లిదండ్రులు మరణించడంతో అనాథలైపోతారు. ఇక చెల్లిలి ఆకలి తీర్చడం కోసం అన్న బిచ్చగాడిగా మారతాడు. ఈ సన్నివేశాలు కూడా పాటలాగే కదిలించేలా ఉన్నాయి. ఈ వీడియో సాంగ్ చూస్తుంటే 'బిచ్చగాడు'లో అమ్మ సెంటిమెంట్ తో ఆకట్టుకున్న విజయ్.. ఈసారి 'బిచ్చగాడు-2'లో చెల్లెలి సెంటిమెంట్ తో కట్టిపడేయడం ఖాయమనిపిస్తోంది. ఈ వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.