English | Telugu
పెద్దగా లేవంటూ రాధిక ఆప్టేపై బాడీ షేమింగ్!
Updated : Apr 12, 2023
బాడీ షేమింగ్ గురించి ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకాస్త ముక్కు బావుండాల్సింది. వక్షోజాలు ఇంకా పెద్దగా ఉండాల్సింది అంటూ రాధిక ఆప్టేను కెరీర్ స్టార్టింగ్‌లో పలువురు విమర్శించారట. ప్రస్తుతం బాలీవుడ్‌లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు రాధికా ఆప్టే. బోల్డ్ రోల్స్ చేయడంలోనూ ఆమెకు ఆమెనే సాటి. లేటెస్ట్ గా మిసస్ అండర్‌కవర్‌లో నటించారు రాధిక. త్వరలోనే విడుదల కానుంది ఈ సినిమా. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న తర్వాత బాగానే ఉంది కానీ, స్టార్టింగ్‌లో మాత్రం చాలా విమర్శలు ఎదుర్కోకతప్పలేదని అంటున్నారు రాధికా ఆప్టే. మిగిలిన హీరోయిన్లలాగా తనకూ అలాంటి చేతు ఎక్స్ పీరియన్స్ ఉందని అన్నారు. `కొందరి పర్‌సెప్షన్స్ చాలా స్ట్రేంజ్‌గా ఉంటాయి. చాలా కాలం వరకు పల్లెటూరి పాత్రలుంటేనే నన్ను పిలిచేవారు. బద్లాపూర్‌లో నా యాక్టింగ్ చూసిన తర్వాత అప్పటిదాకా ఉన్న అప్రోచ్ మారింది. బద్లాపూర్ తర్వాత సెక్స్ కామెడీలుంటే పిలుపు వచ్చేది. ముందు వరుసగా చేసేదాన్ని. కానీ తర్వాత దాన్ని కూడా మానేశాను.
నా దగ్గరకు వచ్చిన వాటికి సింపుల్‌గా యస్ చెప్పడం మానేశాను. నేను ఓ పాత్రకు ఉండాల్సిన బరువు కన్నా మూడో, నాలుగో కిలోలు ఎక్కువగా ఉన్నానని నన్ను వద్దన్నారు. కొత్తల్లో వీటి గురించి మాట్లాడాలంటే తడబాటుగా ఉండేది. కానీ, గత కొన్నేళ్లుగా అవగాహన పెరుగుతోంది. ప్రాజెక్టులు ముఖ్యమా? ఆత్మగౌరవం ముఖ్యమా? అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. నోరు విప్పి మాట్లాడగల ధైర్యం మహిళల్లో వస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు. అండర్‌కవర్ ఆఫీసర్‌గా, ఇల్లాలిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మిసెస్ అండర్‌కవర్‌లో నటించారు రాధికా ఆప్టే.