English | Telugu
ఈ 'ఛత్రపతి' పాకిస్థాన్ నుంచి వచ్చాడు!
Updated : May 2, 2023
తెలుగు బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'ఛత్రపతి' రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హిందీలోనూ అదే టైటిల్ తో పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకుడు. మే 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. ఇక తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ ట్రైలర్ లో ఒక విషయం ఆసక్తికరంగా మారింది.
తెలుగు 'ఛత్రపతి'లో హీరో కుటుంబం శ్రీలంక నుంచి వైజాగ్ కి వచ్చినట్లుగా చూపించారు. అయితే తాజాగా విడుదలైన హిందీ 'ఛత్రపతి' ట్రైలర్ లో మాత్రం హీరో కుటుంబం పాకిస్థాన్ నుంచి పంజాబ్ కి వచ్చినట్టుగా ఉంది. ఈ కథ నార్త్ లో జరిగినట్లు చూపించాలి కాబట్టి అక్కడి రాష్ట్రాలకు బోర్డర్ లో ఉండే దేశాన్ని చూపించాలన్న ఉద్దేశంతో పాకిస్థాన్ ని చూపించినట్టున్నారు. పైగా పాకిస్థాన్ అంటే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నారేమో.
'ఛత్రపతి' హిందీ ట్రైలర్ ని చూస్తుంటే శ్రీలంకకి బదులుగా పాకిస్థాన్ చూపించడం తప్ప పెద్దగా మార్పులు చేయలేదని అర్థమవుతోంది. అదే సమయంలో బడ్జెట్ విషయంలో వెనకాడకుండా భారీగానే తెరకెక్కించారని తెలుస్తుంది. తెలుగు 'ఛత్రపతి'ని మించిన యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అలాగే బెల్లంకొండ స్క్రీన్ ప్రజెన్స్, 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఆకట్టుకుంటున్నాయి.