English | Telugu

అప్పుడు రామ్ చరణ్.. ఇప్పుడు బెల్లంకొండ!

టాలీవుడ్ కి చెందిన పలువురు హీరోలు పాన్ ఇండియా సినిమాలతో హిందీలోనూ తమ మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు. అయితే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం అందుకు భిన్నంగా నేరుగా హిందీలోనే సినిమా చేశాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ బెల్లంకొండ మాత్రం ఇంకా పూర్తిగా తెలుగులో ఎదగకుండానే అప్పుడే హిందీపై దృష్టి పెట్టాడు. అది కూడా 2005 లో వచ్చిన తెలుగు బ్లాక్ బస్టర్ 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మే 12 న విడుదలైన ఈ సినిమా దారుణమైన రివ్యూలను సొంతం చేసుకుంది. మొదటిరోజు కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. గతంలో బెల్లంకొండ నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ అయ్యి, యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అదే బెల్లంకొండను హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టేలా చేసింది. ఏదైనా కొత్త కథలో అక్కడ అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ఇప్పటికే అందరూ చూసేసిన సినిమాని రీమేక్ చేయడం, అవుట్ పుట్ కూడా సరిగా లేదనే టాక్ తెచ్చుకోవడం బిగ్ మైనస్ అయింది. పైగా బెల్లంకొండ యాక్టింగ్ పై కూడా కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. పదేళ్ల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది.

హీరోగా ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే స్టార్ గా ఎదిగిన అతికొద్ది మంది హీరోలలో రామ్ చరణ్ ఒకరు. 'చిరుత'(2007)తో సాలిడ్ ఎంట్రీ ఇచ్చి, రెండో సినిమా 'మగధీర'తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన చరణ్.. ఆ తర్వాత రచ్చ, నాయక్ వంటి కమర్షియల్ హిట్స్ తో సత్తా చాటాడు. ఇలా తెలుగులో అతికొద్ది కాలంలోనే స్టార్ గా ఎదిగిన చరణ్.. 2013 లో హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకొని చేయి కాల్చుకున్నాడు. ఎప్పుడో 40 ఏళ్ళ నాటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'జంజీర్' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా నెగటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. ఆ సమయంలో చరణ్ పై కూడా కొందరు ట్రోల్స్ చేశారు. అయితే వాళ్లందరికీ సరిగ్గా పదేళ్ల తర్వాత పాన్ ఇండియా ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' తో అదిరిపోయే సమాధానమిచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా.. చరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో అక్కడ తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే చరణ్ కి, బెల్లంకొండకి చాలా తేడా ఉంది. చరణ్ ముందుగా తెలుగులో ఎదిగి, ఆ తర్వాత హిందీలో ప్రయత్నించి విఫలమయ్యాడు. మళ్ళీ తెలుగు సినిమాలు చేసుకుంటూనే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. బెల్లంకొండ మాత్రం ఇంకా తెలుగులో నిరూపించుకోకుండానే హిందీలో అడుగులు వేసి చేతులు కాల్చుకున్నాడు. పైగా 'ఛత్రపతి' రీమేక్ ని నిర్మించిన పెన్ స్టూడియోస్ బెల్లంకొండ తో మరో రెండు హిందీ సినిమాలు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. మరి 'ఛత్రపతి' షాక్ తో బెల్లంకొండ తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టి ముందు ఇక్కడ ఎదిగే ప్రయత్నం చేస్తాడో లేక హిందీ జపమే చేస్తాడో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.