English | Telugu

మహేష్, త్రివిక్రమ్ సినిమాకి 'గుంటూరు కారం' టైటిల్ ఖరారు!

'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఎస్ఎస్ఎంబి 28'(వర్కింగ్ టైటిల్). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

'ఎస్ఎస్ఎంబి 28'కి రకరకాల టైటిల్స్ వినిపించాయి. ఇటీవల 'అమరావతికి అటు ఇటు' టైటిల్ ప్రముఖంగా వినిపించింది. త్రివిక్రమ్ టైటిల్స్ కి 'అ' సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి, ఇదే దాదాపు ఫిక్స్ అనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ లుక్ కి తగ్గట్టుగా మాస్ టైటిల్ అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఫ్యాన్స్ కోరినట్టుగానే 'గుంటూరు కారం' అనే అదిరిపోయే మాస్ టైటిల్ ని మూవీ టీమ్ ఖరారు చేసినట్టు సమాచారం. 'అమరావతికి అటు ఇటు', 'గుంటూరు కారం' ఈ రెండు టైటిల్స్ ని పరిశీలించి, చివరికి 'గుంటూరు కారం'కి ఓటేసినట్టు వినికిడి. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31 న టైటిల్ ని రివీల్ చేసే అవకాశముంది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13 న విడుదల కానుంది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.