English | Telugu

ఛార్మి ఐటెమ్‌... మ‌హా కాస్ట్లీ గురూ..!

మ‌సాలా పాట‌ల్లో మ‌జా త‌గ్గినా... వాటికున్న‌ గిరాకీ మాత్రం ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. పాట కోసం ఐటెమ్ గాళ్‌కి ల‌క్ష‌లు ధార‌బోస్తున్నారు. ఆ పాట‌ని భారీ ఎత్తున తీసి త‌మ రిచ్ నెస్‌ని చూపిస్తున్నారు. తాజాగా ఓ ఐటెమ్ పాట కోసం రూ. 3 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారు. విక్ర‌మ్ న‌టిస్తున్న త‌మిళ చిత్రం 10 ఎణ్రదుకుళ్ల’ . విక్ర‌మ్ ప‌క్క‌న ఛార్మి.. ఐటెమ్ పాట‌లో ఆడిపాడ‌బోతోంది. ఈ పాట కోసం చెన్నైలో ఓ భారీ సెట్ వేశారు. దీని కోసం రూ.2.5 కోట్లు ఖ‌ర్చు పెట్టాన‌ని టాక్‌. ఛార్మికి రూ.30 ల‌క్ష‌ల పారితోషికం ఇచ్చార‌ట‌. మొత్తమ్మీద ఇది రూ.3 కోట్ల పాట‌న్న‌మాట‌. పాటంటే నాలుగులేదా 5 నిమిషాల్లో ముగిసిపోతుంది. కానీ ఇది ఏకంగా 9 నిమిషాల పాటు సాగుతుంద‌ట‌. కొన్ని హిందీ చిత్రాల్లో న‌టించిన ఛార్మి.. త‌మిళంలో మాత్రం త‌న హ‌వా చూపించ‌లేదు. ఈ పాట‌తో వాళ్ల‌నీ బుట్ట‌లో వేసుకోవాల‌ని త‌హ‌త‌హ‌తాడిపోతోంది. మ‌రి.. ఖ‌ర్చుకు త‌గిన ప్ర‌తిఫ‌లం వ‌స్తుందో లేదో..! ఈ పాట గ‌నుక క్లిక్క‌యితే.. త‌మిళంలో ఐటెమ్ గాళ్‌గా ఛార్మి నిల‌బ‌డిపోవ‌డం ఖాయం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.