English | Telugu

క‌ర్చీఫ్ రెడీ చేసిన నాగార్జున‌

అస‌లే సినీ లోకం హిట్ అనే ప‌దం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంటుంది. ఎవ‌రైనా హిట్ కొడితే చాలు.... వాళ్ల‌పై క‌ర్చీఫ్‌లు వేసుకోవ‌డానికి అంతా రెడీనే. నాగార్జున కూడా అందుకు మిన‌హాయింపు కాదు. ఇది వ‌ర‌కు నాగ్ టాలెంట్ ని సెర్చ్ చేసేవాళ్లు. ఇప్పుడు టాలెంట్ ఎక్క‌డుంటే అక్క‌డ ఉంటున్నాడు. కొండా విజ‌య్‌కుమార్‌, దేవాక‌ట్టా, వీర‌భ‌ద్ర‌మ్‌... వీళ్లంతా హిట్లు కొట్టాకే అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో అడుగు పెట్టారు. ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడిపై నాగ్ దృష్టి ప‌డింది. ఆయ‌నే.. చందూ మొండేటి. కార్తికేయ సినిమాతో అరంగేట్రం చేసిన ద‌ర్శ‌కుడీయ‌న‌. ఈ సినిమాని మ‌ల‌చిన విధానం అంద‌రికీ న‌చ్చింది. త‌క్కువ బ‌డ్జెట్‌తో క్వాలిటీ సినిమా తీశాడు. కుర్రాడిలో విష‌యం ఉంద‌ని గ్ర‌హించిన నాగ్‌... చందూని పిలిపించుకొన్నార‌ని టాక్‌. అంతేకాదండోయ్‌... చందూ నాగ్‌కి పెద్ద ఫ్యాన్ కూడా సో.. ఈ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. అయితే నాగ్ స్వ‌యంగా రంగంలోకి దిగుతాడా? లేదంటే నాగ‌చైత‌న్య కోసం ఓ సినిమా తీయ‌మంటాడా అన్న‌ది తేలాల్సివుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.