English | Telugu

ప‌వ‌న్ వ‌ద్దు మొర్రో అంటున్నాడట‌!

క‌త్తి సినిమాని ప‌వ‌న్ క‌ల్యాణ్ రీమేక్ చేస్తున్నాడ‌ట‌, ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం త‌గిన ద‌ర్శ‌కుడిని వెదుతుకున్నాడ‌ట‌... అంటూ టాలీవుడ్‌లో నాలుగైదు రోజుల నుంచి ఎడ‌తెగ‌ని ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ప‌వ‌న్ క‌త్తి సినిమా చూశాడ‌ని, చాలా ఇంప్రెస్ అయ్యాడ‌ని, గబ్బ‌ర్ సింగ్ 2ని కూడా ప‌క్క‌న పెట్టి, ఈ ప్రాజెక్టును చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్టు టాలీవుడ్‌లో చెప్పుకొన్నారు. కానీ అంత సీన్ లేద‌ని తేలిపోయింది. ప‌వ‌న్ ఈ సినిమాని చేయ‌డం లేద‌ని తేలిపోయింది. ఈ సినిమా ప‌వ‌న్ చేస్తానంటే తెలుగులో రీమేక్ చేద్దామ‌ని నిర్మాత ఠాగూర్ మ‌ధు భారీ ఎత్తున ప్ర‌య‌త్నాలు చేశారు. ప‌వ‌న్‌కి ఈసినిమా చూపించాల‌ని శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. కానీ ప‌వ‌న్ మాత్రం ''నేను ఈ సినిమా చేయ‌ను మొర్రో'' అంటున్నాడ‌ట‌. మ‌రీ బ‌ల‌వంతం చేస్తే... ప‌వ‌న్ ఆగ్ర‌హానికి గురి కావ‌ల్సివ‌స్తుంద‌ని వెనుక‌డుగు వేసింది క‌త్తి చిత్ర‌బృందం. ప‌వ‌న్ సినిమా చేస్తాడేమో అని... క‌త్తి సినిమా తెలుగులో విడుద‌ల చేయకుండా ఆపేశారు. ఇప్పుడు హ‌ఠాత్తుగా ఈ సినిమాని తెలుగులో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లెట్టేశారు. న‌వంబ‌రు 7న తెలుగులో క‌త్తి విడుల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.