English | Telugu

సెలెబ్రిటీ క్రికెట్ లో సౌత్ సూపర్ స్టార్స్ గెలిచారు

సౌత్ సూపర్ స్టార్స్ , బాలీవుడ్ హీరోస్ కీ మధ్య విశాఖపట్టణంలో, వై యస్ రాజశేఖర రెడ్డి స్టేడియమ్ లో జరిగిన సి.సి.యల్. ( సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ )కర్టెన్ రైజర్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో సౌత్ సూపర్ స్టార్స్ నిజంగానే సూపర్ స్టార్స్ అనిపించారు. అంటే ఈ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో సౌత్ సూపర్ స్టార్స్ 36 పరుగుల తేడాతో బాలీవుడ్ హీరోస్ మీద ఘనవిజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ సూపర్ స్టార్స్ నిర్ణీత ట్వంటీ ఓవర్లలో నూటతొంభై మూడు పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని బాలీవుడ్ హీరోస్ ముందుంచింది.

సౌత్ సూపర్ స్టార్స్ కెప్టెన్ వెంకటేష్ బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్ చివరి బంతిని సిక్సర్ గా మలచి స్టేడియంలోనూ, టి.వి.ల ముందు వీక్షిస్తున్న అశేష అభిమానులను అలరించారు. సౌత్ సూపర్ స్టార్స్ లో నందమూరి తారకరత్న పదమూడు బంతుల్లోనే ముప్పై పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన బాలీవుడ్ హీరోస్ ని సౌత్ సూపర్ స్టార్స్ కేవలం నూట యాభై ఏడు పరుగులకు మాత్రమే కట్టడి చేయగలిగి ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ హీరోస్ కీ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.