English | Telugu

ప్రధానితో 30నిముషాలు గడిపిన ఐశ్వర్య


అందానికి దాసోహం అనని హృదయం వుండదు. వున్నా ఆ హృదయానికి విలువ లేనట్లే. వయసు పెరిగిన కొద్దీ అందం రెట్టింపు అవుతూ వున్న అందగత్తె ఐశ్వర్య. అందం ఆమెకున్న ఐశ్వర్యం. చూపు తిప్పుకోలేని ఈ అతిలోక సుందరి, ఒక బిడ్డకు తల్లైనా ఆమె ఆకర్షణా, అందం ఏ మాత్రం తగ్గలేదు. ఈ వరల్డ్ బ్యూటీకి ఈ మధ్య ఒక అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల లండన్ వెళ్లిన ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను ఆ దేశ ప్రధాని, ఆయన సతీమణి ఎంతో ఆదరంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
బ్రిటీష్ ప్రధాని డేవిడ్ ఐశ్వర్యతో ఏకంగా అరగంట సేపు ముచ్చటించాడట. ఐశ్వర్య కెరీర్ గురించి సలహాలు కూడా ఇచ్చాడట. హాలీవుడ్ చిత్రాలలో నటించమని ఆమెను కోరాడట. ఇంకా ఐశ్వర్య ప్రస్తుతం చేస్తున్న జజ్బా షూటింగ్ కోసం లండన్ రావాలని ఆహ్వానించారు బ్రిటీష్ ప్రధాని. అగ్రదేశాలలో ఒకటైన బ్రిటన్ ప్రధాని, ఐశ్వర్యతో అరగంట గడిపారంటే, ఐశ్వర్య కున్న గుర్తింపు ఏమిటో తెలుసుకోవచ్చు. అందాల సుందరి అమ్మ అయినా అభిమానులు మాత్రం తగ్గలేదు. గ్రేట్ గోయింగ్ ఐశ్వర్య


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.