English | Telugu
సమంత చెప్పులు చూపించింది..!
Updated : Nov 11, 2014
సమంత చెప్పులు చూపించింది అంటే మరో కాంట్రవర్సిలో ఇరుక్కుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే పోరపాటు పడినట్లే..! టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న సమంత కొన్ని రోజుల క్రితం పారగాన్ చెప్పులు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. దీంతో తన అభిమానులను కూడా పారగాన్ చెప్పులు వాడండీ అంటూ పిలుపునిస్తోంది. అయితే తాజాగా తెలుగు యాక్టర్ బ్రహ్మాజీ కారులో వెళుతుంటే ..పారగాన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న సమంత ఫ్లెక్సీ బస్‌కు అంటించి ఉండగా ఆయన చూసారట. దీంతో '' నేను నిన్ను ఫాలో అవుతున్నాను.. దయచేసి చెప్పులు చూపొద్దు " అంటూ సమంతపై సరదా ట్వీట్ వేశాడట. ఈ విషయం తెలియక మొదట సమంత అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు కంగారు పడ్డారట. అసలు విషయం తెలిసి అందరూ నవ్వుకున్నారట!