English | Telugu

లారెన్స్‌కి బెయిల్ దొరికింది


రెబ‌ల్ సినిమా ఇంకా లారెన్స్‌ని వెంటాడుతోంది. ఆ సినిమాని ప్ర‌భాస్ ఫ్యాన్స్ సైతం మ‌ర్చిపోయారు. కానీ నిర్మాత‌ల‌కు మాత్రం.. ఈ పేరుతో లారెన్స్‌ని వెంటాడుతూనే ఉన్నారు. ఈ సినిమా విష‌యంలో లారెన్స్ త‌మ‌ని మోసం చేశాడ‌ని నిర్మాత‌లు భ‌గ‌వాన్, పుల్లారావులు లారెన్స్‌పై జూబ్లీ హిల్స్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. లారెన్స్‌పై 406, 420 కేసులు న‌మోద‌య్యాయి. దాంతో లారెన్స్ ముంద‌స్తు బెయిల్‌కి కోర్టులో అప్లై చేసుకొన్నాడు. న్యాయ స్థానం లారెన్స్‌కి బెయిలు మంజూరు చేసింది. అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్లో హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.


రెబ‌ల్ చిత్రాన్ని లారెన్స్ రూ.22.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తానని నిర్మాత‌ల‌కు మాటిచ్చాడ‌ట‌. దానికంటే ఎక్కువ ఖ‌ర్చ‌యితే న‌ష్టాన్ని భ‌రిస్తానని ఒప్పందం చేసుకొన్నాడ‌ట‌. ఆ బ‌డ్జెట్ దాటి ఖ‌ర్చు చేయ‌డంతో పాటు, సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో నిర్మాత‌లు భారీగా న‌ష్ట‌పోయారు. ఆమొత్తానికి డ‌బ్బులు తిరిగి చెల్లించ‌మ‌ని నిర్మాత‌లు అడిగితే.. లారెన్స్ మొహం చాటేశాడు. నిర్మాతల మండ‌లిలో, ద‌ర్శ‌కుల సంఘంలో ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. దాంతో నిర్మాత‌లు ఇప్పుడు పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సివచ్చింది. మ‌రి ఈ వివాదం ఎక్క‌డ‌కు వెళ్లి ఆగుతుందో...??

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.