English | Telugu

‘సలార్‌’ దెబ్బకి క్రాష్‌ అయిన బుక్‌ మై షో యాప్‌!

ఈమధ్యకాలంలో ప్రభాస్‌ ‘సలార్‌’కి వచ్చినంత క్రేజ్‌, హైప్‌ ఏ సినిమాకీ రాలేదు. ప్రమోషన్స్‌ను పెద్ద ఎత్తున చేయకపోయినా అంచనాలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. డిసెంబర్‌ 22 కోసం సినిమా లవర్స్‌, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సలార్‌ను థియేటర్స్‌లో చూస్తామా అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలవుతున్న సలార్‌ ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని, కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుందని యూనిట్‌ ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తుంటే ప్రమోషన్స్‌ కూడా పెద్దగా అవసరం లేదు అన్నట్టుగా ఉంది.

ఇప్పటికే హిందీ, కన్నడ, తమిళ్‌ బుక్‌ మై షోలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కోసం వదిలారు. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం వదలలేదు. టికెట్‌ రేట్స్‌ పెంచుకోవడానికి నిర్మాతలు ప్రభుత్వాలకి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. దీంతో బుక్‌ మై షోలో ఆన్‌ లైన్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా టికెట్లు బుక్‌ చేసుకోవడానికి పోటీ పడ్డారు. లక్షలాది మంది ఒకేసారి ప్రయత్నం చేయడంతో బుక్‌ మై షో యాప్‌ సైతం క్రాష్‌ అయ్యింది. దీన్ని బట్టి ఆన్‌ లైన్‌తో సలార్‌ టికెట్స్‌ కోసం అందరూ ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారో అర్థమవుతోంది. దీనిపై ప్రభాస్‌ అభిమాని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా బుక్‌ మై షో టీం అంతరాయానికి క్షమాపణలు చెప్పి ఇష్యూ ఫిక్స్‌ చేస్తున్నట్లు చెప్పింది. అయితే సలార్‌ టికెట్‌ ధరలు కూడా భారీగా పెరిగాయి సింగిల్‌ థియేటర్స్‌ లో 175 నుంచి 250 వరకు ధరలు ఉంటే మల్టీప్లెక్స్‌లలో మాత్రం 400 నుంచి 470 వరకు టికెట్‌ ధరలు ఉన్నాయి. అంతేకాదు, ఐదు షోలకు కూడా పర్మిషన్‌ వచ్చేసింది. దీంతో మొదటి రోజు బుక్‌మై షోలో టికెట్స్‌ అన్నీ అయిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో మొదటిరోజు టికెట్స్‌ ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఎక్కువ షోలు పడే అవకాశం ఉండడంతో మొదటి రోజు అన్ని థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.