Read more!

English | Telugu

తెలుగులో 'బిచ్చగాడు-2'కి షాకింగ్ కలెక్షన్స్!

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ్ డబ్బింగ్ మూవీ 'బిచ్చగాడు' 2016 లో విడుదలై తెలుగునాట ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రాబట్టి సంచలన విజయం సాధించింది. అయితే ఇప్పుడు 'బిచ్చగాడు-2' విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది.

విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'బిచ్చగాడు-2'. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో నిన్న(మే 19) విడుదలైంది. 'బిచ్చగాడు' స్థాయిలో లేదంటూ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా తమిళ్ కంటే కూడా తెలుగులో ఎక్కువ ఓపెనింగ్స్ రావడం విశేషం. తమిళనాట ఈ సినిమా మొదటిరోజు రూ.3.05 కోట్ల గ్రాస్ రాబట్టగా.. తెలుగులో రూ.4.10 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో కోటి గ్రాస్ వచ్చింది. మొత్తానికి మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.8.15 కోట్ల గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. షేర్ పరంగా చూస్తే రూ.4 కోట్లు. వరల్డ్ వైడ్ గా రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ఈ మూవీ.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా 11 కోట్ల దూరంలో ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్ల బిజినెస్ చేసిన 'బిచ్చగాడు-2'.. మొదటిరోజు రూ.2.32 కోట్ల షేర్(4.10 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. 'కోబ్రా', 'విక్రమ్', 'పెద్దన్న', 'పొన్నియిన్ సెల్వన్-2' వంటి బడా తమిళ సినిమాలను మించి తెలుగులో ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. ఈ ఓపెనింగ్స్ చూస్తుంటే ఏడేళ్ళు అవుతున్నా తెలుగునాట 'బిచ్చగాడు' మేనియా ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. ఇదే జోరు కొనసాగితే తెలుగులో మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది.