English | Telugu

ఫ్యాన్స్ కి పండగే.. 'ఎన్టీఆర్ 31' అప్డేట్ వచ్చేసింది!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. వరుస అప్డేట్స్, సెలబ్రేషన్స్ తో వాళ్ళు గాలిలో తేలిపోతున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమా 'దేవర' ఫస్ట్ లుక్ నిన్న(మే 19) సాయంత్రం విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈరోజు 'సింహాద్రి' రీరిలీజ్ తో థియేటర్ల వద్ద అభిమానులు తెగ హంగామా చేస్తున్నారు. అలాగే 'వార్-2'తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా హృతిక్ రోషన్ క్లారిటీ ఇచ్చేశాడు. వీటితో పాటు తాజాగా 'ఎన్టీఆర్ 31' అప్డేట్ కూడా వచ్చేసింది.

ఎన్టీఆర్ తన 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. గతేడాది ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని వదలగా.. కేవలం ఒక్క పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ని ఈరోజు మేకర్స్ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి నుంచి షూటింగ్ మొదలు కానుందని ప్రకటించారు.

ఎన్టీఆర్ ఈ ఏడాది చివరి కల్లా 'దేవర' షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత 'వార్-2' షూటింగ్ తో బిజీ అయ్యే అవకాశముంది. 'వార్-2' కోసం కేవలం రెండు-మూడు నెలలు మాత్రమే కేటాయించి.. అది పూర్తి కాగానే తన పూర్తి దృష్టిని 'ఎన్టీఆర్ 31' పైనే పెట్టనున్నాడని అంటున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.