English | Telugu
ప్రేమించి పెళ్లి చేసుకున్న భరత్
Updated : Sep 13, 2013
"బాయ్స్", "ప్రేమిస్తే" చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు భరత్ ఓ ఇంటి వాడయ్యాడు. తను ప్రేమించిన అమ్మాయి జెస్సీని మంగళవారం చెన్నైలో వివాహం చేసుకున్నాడు. భరత్ కి, దుబాయ్‌లో దంత వైద్యురాలుగా పనిచేస్తున్న జెస్సీల మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో నిన్న ఉదయం చెన్నైలోని ఓ హోటల్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వివాహా అనంతరం భరత్, జెస్సీలు తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ వీరి వివాహ రిసెప్షన్ ఈ నెల 14వ తేదీన చెన్నైలో జరగనుంది.