English | Telugu
అంజలికి బిగుసుకున్న ఉచ్చు
Updated : Sep 13, 2013
హీరోయిన్ అంజలికి చెన్నైలోని సైదాపేట కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంజలి తనపై ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు కళంజియం ఆమెపై పరువునష్టం దావా వేసారు. దర్శకుడు కళంజియం వేసిన పరువు నష్టం దావా కేసులో హాజరు కావాలని కోర్టు పలుసార్లు ఆమెకు నోటీసులు జారీ చేసినా కూడా అంజలి హాజరు కాకపోవడంతో ఆగ్రహంతో ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది.
గతంలో తన పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తన ఆస్తులను వాడేసుకుంటూ, మానసికంగా తనను హింసిస్తున్నారని అంజలి మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యాలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులు ఎవరికీ కనిపించకుండా పోయి, మళ్ళీ ఇపుడు తిరిగి సినిమాల్లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్న అంజలి... తనపై తప్పుడు ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు కళంజియం ఆమెపై పరువునష్టం దావా వేసారు. అంజలి తన సినిమాకు డేట్స్ ఇచ్చి షూటింగ్ కి హాజరు కాకపోవడం వలన తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని దర్శకుడు కలంజియంపేర్కొన్నారు. మరి దీనికి అంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి.