English | Telugu
‘భగవంత్ కేసరి’ బ్లాస్టింగ్ అప్‌డేట్.. ఏమిటో తెలుసా?
Updated : Oct 5, 2023
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. థమన్ పాటలను అద్భుతంగా స్వరపరిచాడని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక కొత్త అప్‌డేట్ రాబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్టోబర్ 5 సాయంత్రం గం4.10లకు ‘బ్లాస్టింగ్ అప్‌డేట్’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఈ అప్‌డేట్ ఏమిటనేది సస్పెన్స్‌లో ఉంచారు. ‘భగవంత్ కేసరి’కి సంబంధించిన ట్రైలరే అయివుంటుందని అందరూ భావిస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి ఫస్ట్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే రాబోతున్న అప్‌డేట్ ఏమిటి అనేది అందరికీ ఒక ఆసక్తికర ప్రశ్న అయిపోయింది.