English | Telugu

పూజ హెగ్డే కి గాయాలు..ఏం జరిగింది!

ముకుంద సినిమాతో తెలుగు తెరమీద తళుక్కుమని మెరిసిన నటి పూజ హెగ్డే . సాధారణంగా హీరోని ఆరడగుల అందగాడని అంటారు కానీ పూజ హెగ్డే రాకతో హీరోయిన్ ని కూడా ఆరడగుల అందగత్తె అని పిలవడం స్టార్ట్ చేసారు. అందానికి అందం ఆ అందానికి తగ్గట్టు నటనతో అతి కొద్దీ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ రేంజ్ కి వెళ్లి తనకంటూ అభిమానులని కూడా పూజ సంపాదించుకుంది. లేటెస్ట్ గా తన సోషల్ మీడియా ఖాతాలో తన మోకాళ్ళకి దెబ్బలు తగిలిన ఫొటోస్ ని పెట్టి పూజకి ఏమైంది అని అందరు అనుకొనేలా చేసింది. పైగా ట్రోల్ల్స్ అండ్ మీమ్స్ బారిన కూడా పడి ట్రేండింగ్ లో నిలిచింది.

రెండు సంవత్సరాల క్రితం తెలుగులో ఏ అగ్ర హీరో సినిమా ప్రారంభం అయిన ఆ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ఉండాలసిందే. దాదాపు అందరి అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరయిన్ గా చెలామణి అయిన పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగులో ఒక్క మూవీలో కూడా చెయ్యటం లేదు. చెయ్యటం లేదు అనే కంటే అవకాశాలు రాలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ఇటీవల పూజ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి. చిరంజీవి ఆచార్య,ప్రభాస్ రాధేశ్యాం,తమిళ్ విజయ్ నటించిన బీస్ట్ మూవీలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూశాయి. దీంతో అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. హిందీ లో కూడా సల్మాన్ ఖాన్ పక్కన చేసింది కానీ అది కూడా ప్లాప్ అయ్యింది.

ఆ విషయాలన్నీ అలా ఉంచితే ఎప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ యాక్టీవ్ గా ఉండే పూజ కొన్ని హాట్ హాట్ ఫోటోలని కూడా తన ఖాతాలో ఉంచుతుంది. అభిమానులు ,తన ఫాలోవర్స్ ఆ ఫోటోలని చూసి తెగ ఎంజాయ్ చేస్తారు. ఎప్పటిలాగానే పూజ సోషల్ మీడియా అకౌంట్ ని చుసిన వాళ్ళకి పూజ కాళ్లకి గాయాలు అయిన ఫొటోస్ ని చూసి ఒక్క సారిగా షాక్ అయ్యారు. కరెక్టుగా మోచిప్పల మీద ఎర్రగా కమిలిపోయినట్టుగా గాయాలు ఉన్నాయి .ఇప్పుడు ఈ గాయాలని చూసిన వాళ్ళు పూజ ఏమైనా యుద్ధ సన్నివేశాలు చేసి వస్తుందా ఏంటి ?త్రివిక్రమ్ సినిమా లో చెయ్యటం లేదుగా అని అంటున్నారు. అలాగే ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు పూజ గాయాల మీద రకరకాల మీమ్స్ ట్రోల్స్ ని చేస్తున్నారు .ప్రస్తుతం పూజకి సంబంధించిన ఈ విషయాలన్నీ హైలెట్ అవు తున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.