English | Telugu

బెజవాడలో "బెజవాడ" కు థియేటర్ల కరువు

బెజవాడలో "బెజవాడ" కు థియేటర్ల కరువయ్యాయట. ఇది విచిత్రంగా ఉన్నా నిజం. నవయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తూండగా, వివేక్ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ వివాదాస్పద దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న చిత్రం "బెజవాడ". ఈ చిత్రానికి ముందుగా "బెజవాడ రౌడీలు" అని పేరు పెట్టి, ఆ పేరు ఎవరెంత మొత్తుకున్నా మార్చనన్న రామ్ గోపాల వర్మ తర్వాత మనసు మార్చుకుని దాన్ని "బెజవాడ" గా మార్చారు.

దీనితో పాటు బెజవాడలోని దేవినేని వర్గం, వంగవీటి వర్గాల మధ్య గతంలో రగిలిన కథే నేపథ్యంగా ఈ "బెజవాడ" చిత్రం నిర్మించారన్న ప్రచారం జరిగింది. దాంతో ఈ వర్గవైషమ్యాలకు తమ థియేటర్లు ఎక్కడ తగలడిపోతాయోనని థియేటర్ యజమానులు భయపడటంతో "బెజవాడ" సినిమా కేవలం నాలుగు థియేటర్లలో మాత్రమే విడుదలవుతుంది. లేకపోతే పన్నెండు నుండి పదిహేను థియేటర్లలో ఈ సినిమా అక్కడ విడుదల కావలసి ఉంది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.