English | Telugu

బెల్లంకొండ‌ను చుట్టేశారు!

గంగ సినిమా విడుద‌ల మ‌ళ్లీ సంక్షోభంలో ప‌డింది. ఈ సినిమా త‌మిళంలో ఆల్రెడీ విడుద‌లైపోయింది. అక్క‌డ హిట్ టాక్ వ‌చ్చింది. తెలుగులోనూ వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాని తీసుకురావాల‌ని బెల్లంకొండ సురేష్ వీర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఆయ‌న చేసిన అప్పులు.. గంగ పాలిట శాపాలుగా మారాయి. ర‌భ‌స‌, అల్లుడు శీను సినిమాల స‌మ‌యంలో ఆయ‌న చేసిన అప్పులు, బ‌య్య‌ర్ల‌కు ఎగ్గొట్టిన బాకీలూ.. మెడ‌కు చుట్టుకొన్నాయి. అవి తీరిస్తే గానీ.. గంగ‌ని విడుద‌ల చేయ‌నివ్వం అంటూ బాకీదార్లు బెల్లంకొండని చుట్టేశారు. గ‌త నాలుగు రోజుల నుంచీ.. బెల్లంకొండ వాళ్ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు టాక్‌. అస‌లులో 40 శాతం ఇస్తా.. మిగిలింది త‌ర‌వాత చూద్దాం.. అని బెల్లంకొండ చెబుతున్నా.. బాకీదార్లు ప‌ట్టువిడ‌వ‌డం లేద‌ట‌. అస‌లు, వ‌డ్డీ ఇప్పుడే చెల్లించాలి.. లేదంటే గంగ విడుద‌ల కానివ్వం అంటూ భీష్మించుకొని కూర్చున్నార‌ట‌. ఈరోజు ఎలాగైనా స‌రే... ఈ స‌మ‌స్యకి ప‌రిష్కారం దొర‌కాల్సిందే. లేదంటే.. గంగ సినిమా మ‌రో వారం వాయిదా ప‌డ‌క త‌ప్ప‌దు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.