English | Telugu

బిబిసిలో రాజమౌళి అండ్ రానా


బిబిసి అంటే ఏమిటో కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో ఆస్కార్ గురించి ఎంత మాట్లాడుకుంటారో, మీడియాకి సంబంధించి అంత పేరున్న బిబిసి అంటే తెలియని మీడియా మానవులుండరు. బిబిసిలో మన దేశం గురించి, లేదా మన దేశీయుల గురించి ఏదైనా వార్త వచ్చిందంటే అదే ఇక్కడి మీడియాకు పెద్ద వార్త అవుతుంది . అలాంటి వార్త ఇప్పుడు మరొకటి వెలువడింది.
మరికొద్ది రోజుల్లో మిస్టర్ పర్‌ఫెక్టు డైరెక్టర్ అలియాస్ మన జెక్కన్న బిబిసి ఛానల్‌లో ప్రత్యక్షం కానున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే, భారతీయ సినిమా ఈ మధ్యే వందేళ్ళు పూర్తి చేసుకుంది.ఈ పండుగని అన్ని పరిశ్రమలు ఘనంగా జరుపుకున్నాయి. ఆ అంశాన్ని డాక్యుమెంటరీలో పొందుపరుస్తున్నారు బిబిసికి చెందిన సంజీవ్ భాస్కర్. అదే డాక్యుమెంటరీలో భాగంగా ఆయన బాహుబలి సినిమా రాజమౌళిని, హీరో రానాని ఇంటర్వ్యూ కూడా చేశారు. వీరినే కాదు ఆ చిత్రానికి పనిచేస్తున్న చాలా మందిని ఆయన ఇంటర్వ్యూ చేశారని ట్విట్టర్‌ ద్వారా తెలియపరిచారు బాహుబలి టీం.
టెక్నికల్ వాల్యూస్‌ ద్వారా టాలీవుడ్‌కి సరికొత్త ఇమేజ్ తీసుకు వచ్చిన రాజమౌళి బిబిసితో ఏం ముచ్చటించారో, ఆ డాక్యుమెంటరీ విడుదలైన తర్వాతే తెలియాలి. కానీ ఈ ఇంటర్య్వూ ద్వారా బాహుబలికి మరికొంత పబ్లిసిటీ మాత్రం వచ్చిపడిందని టాక్. బాహుబలి చిత్రం మొదలైనప్పటి నుంచి ప్రముఖులు ఎంతో మంది రాజమౌళిని అభినందించడానికి, చిత్ర విశేషాలు తెలుసుకోవడానికి పలకరిస్తునే వున్నారు. అందులో రజనీకాంత్ లాంటి ప్రముఖలు కూడా వున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా రాజమౌళిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి.
ఇది కేవలం రాజమౌళికే కాక టాలీవుడ్ కు కూడా చక్కటి పరిణామమే అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. బాహుబలి చిత్రం ద్వారా ఆయన ఇమేజ్ మరింత గొప్ప స్థాయిని అందుకోవడం తథ్యమనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ జెక్కన్న అండ్ టీం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.