English | Telugu

బందిపోటు రివ్యూ

Bandipotu Review, Bandipotu Movie Review, Bandipotu Telugu Movie Review, Bandipotu Movie Rating, Bandipotu User Review, Bandipotu Movie Public Talk

న‌వ్వండి ప్లీజ్
మీరు న‌వ్వ‌క‌పోతే నా మీదొట్టే!
న‌వ్విన వాళ్ల‌కి ల‌క్ష‌...
ప‌డీ ప‌డీ న‌వ్వితే.. ప‌ది ల‌క్ష‌లు..

ఇలాంటి బ‌తిమాలుడు కార్య‌క్ర‌మాల‌కు దిగితే త‌ప్ప‌.. ఆఫ‌ర్ల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తే త‌ప్ప‌.. బందిపోటు మిమ్మ‌ల్ని న‌వ్వించ‌దు.
న‌రేష్ సినిమా అంటే కామెడీ మాత్ర‌మే కాదు.. దాన్నో థ్రిల్ల‌ర్‌లా తీద్దామ‌నుకొన్నాడేమో ద‌ర్శ‌కుడు. కామెడీ ట‌చ్ చేయ‌కుండా వ‌దిలేశాడు. పోనీ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఏమైనా ఇచ్చాడా అంటే.. అదీ లేదు.
న‌రేష్ సినిమాల్లో కామెడీ లేక‌పోవ‌డం - ఇదే తొలిసారి
ఇంద్ర‌గంటి సినిమాల్లో ఎమోష‌న్ లేక‌పోవ‌డం - ఇదే తొలిసారి
త‌నికెళ్ల భ‌ర‌ణి క్యారెక్ట‌ర్ చూస్తే ఇకారం రావ‌డం - ఇదే తొలిసారి
న‌రేష్ సినిమాకెళ్లి.. బ‌య‌ట‌కు వ‌స్తూ వ‌స్తూ త‌ల‌లుప‌ట్టుకోవ‌డం - బ‌హుశా ఇదే తొలిసారి!!
మొత్తానికి బందిపోటు తెప్పించిన త‌ల‌పోటు ఏ విధంగా ఉందంటే....

విశ్వ (న‌రేష్‌) త‌న తెలివితేట‌ల‌తో ఇత‌రుల్ని బురిడీ కొట్టిస్తుంటాడు. దొంగ‌ల్ని దోచుకోవ‌డం అత‌ని ఫార్ములా. విశ్వ‌ని జాహ్న‌వి(ఈషా) ఫాలో అవుతుంది. విశ్వ ఇత‌రుల్ని బ‌క‌రాలు చేసిన విధానాన్ని... షూట్ చేసి అత‌నికే చూపిస్తుంది. ఎందుకంటే.. జాహ్న‌వికి ఓ ప‌ని చేసి పెట్టాలి. అదేంటంటే.. స‌మాజంలో పెద్ద మ‌నుషులుగా చ‌లామ‌ణీ అవుతున్న మ‌క‌రందం (భ‌ర‌ణి), శేష‌గిరి (రావుర‌మేష్), భ‌లే బాబు (పోసాని)ల‌కు వెర్రి వెధ‌వ‌ల్ని చేసి, వాళ్ల ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు దోచుకోవాలి. దానికి విశ్వ ఒప్పుకొంటాడు. మ‌క‌రందంది పురాత‌న వ‌స్తువుల్ని కొనే వీక్‌నెస్ ఉంటుంది. శేష‌గిరికి త‌న తెలివితేట‌ల‌పై అపార‌మైన న‌మ్మ‌కం. భ‌లే బాబుకి ఎప్ప‌టికైనా పీఎమ్ కావాల‌న్న‌ది కోరిక‌. ఈ ముగ్గురి వీక్‌నెస్‌ల‌తో ఆటాడుకొని వాళ్ల‌ని బ‌క‌రాల్ని చేస్తాడు విశ్వ‌. అదెలా అనేది తెర‌పై చూడాలి.

బందిపోటు అనే పాత టైటిల్‌ని వాడుకొన్నందుకేమో.. క‌థ కూడా బీసీ కాలం నాటిదే రాసుకొన్నాడు ఇంద్ర‌గంటి. ముగ్గుర్ని వెధ‌వ‌ల్ని చేయ‌డంతోనే హీరోని ఎలివేట్ చేయాల‌ని ప్ర‌య‌త్నించాడు. ముగ్గురు విల‌న్ల‌ను వారి వీక్‌నెస్‌ల‌తో ఆడుకోవ‌డం అరిగిపోయిన ఫార్ములా. అదే ప‌ట్టుకొని ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ‌లాంటి సెన్సిటీవ్ ద‌ర్శ‌కుడు ప‌ట్టుకొని వేలాడ‌డం అత్యంత ఇబ్బందిపెట్టిన విష‌యం. నిజానికి న‌రేష్ ఇది వ‌ర‌కు సినిమాల్లో ఇలాంటి ట్రిక్కులు చాలా చేశాడు. అయితే అవ‌న్నీ ఒక ఎపిసోడ్‌కే ప‌రిమితం. వాటిని సాగ‌దీసి ఓ సినిమా చేశాడు. ముగ్గుర్ని మోసం చేయాల‌న్న కాన్సెప్ట్‌లో తొలి ఇద్ద‌రిని మోసం చేయ‌డంతో ఇంట్ర‌ల్ వెల్ కార్డు ప‌డిపోతుంది. ఆ మిగిలిన ఒక్క‌రి కోసం మిగిలిన స‌గం చూడాలి. సినిమా పేరు బందిపోటు. తెలివైన దొంగ‌గా బిల్డ‌ప్పులు ఇచ్చారు. కానీ ఆ తెలివి తేట‌ల్న‌యినా తెర‌పై చూపాలి క‌దా..?? అదీ లేదు. బందిపోటు అన్న టైటిల్ కి న్యాయం చేయ‌డానికైనా హీరో ఒక్క బ‌డా దొంగ‌త‌నం అయినా చేయ‌డు. పైగా ముగ్గుర్ని మోసం చేసిన విధానంలోనూ ఎలాంటి ఆసక్తి లేదు. ఇక్క‌డ విల‌న్ల‌లోని వెర్రిత‌నాన్ని త‌ప్ప‌... హీరోలోని హీరోయిజాన్ని చూపించ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు

గుప్త‌నిధులున్నాయ‌ని ఒక‌డికి ఏమాత్రం ప‌నికిరాని భూమిని రూ.5 కోట్ల‌ని అంట‌గ‌డ‌తారు. ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్‌తో ఒక‌రి ద‌గ్గ‌ర నుంచి ప‌ది కొట్లు నొక్కేస్తాడు. రాజ‌కీయంగా ఎద‌గాల‌ని చూస్తున్న ఒక‌రిని.. వాడి అరాచ‌కాల‌న్నీ సీక్రెట్ కెమెరాల‌తో షూట్ చేసి వాడ్ని బ‌క‌రా చేస్తారు. ఎప్ప‌టి ఫార్ములాలు ఇవ‌న్నీ..??? ఇంద్ర‌గంటిలోని మ్యాజిక్ ఏమైంది? న‌రేష్‌లోని కామెడీ ఏమైంది?? వీళ్లిద్ద‌రూ ఏదో ఊడ‌బొడిచేస్తార‌నే ఆశల‌తో థియేట‌ర్‌కి వెళ్తే.. ప్రేక్ష‌కుల‌కు నిరాశ ఎదురైంది. ఇంద్ర‌గంటి సినిమాలో చాలా సున్నిత‌మైన కామెడీ ఉంటుంది. మాటల్లో ఫ‌న్ ఉంటుంది. కానీ అది ఈ సినిమాలో మిస్ అయ్యింది. న‌రేష్ సినిమాల్లోని లౌడ్ కామెడీ టోట‌ల్‌గా గ‌ల్లంత‌య్యింది. మూడు ముక్క‌ల్లో చెప్పాల్సిన క‌థ‌ని సాగ‌దీసి రెండుగంట‌ల సినిమా చేశారు. దాంతో ఈ బందిపోటు తెగ బోర్ కొట్టేస్తాడు. ప‌తాక స‌న్నివేశాలైతే.. హాహాకారాలే. దొరికిన ప్రేక్ష‌కుల్ని దొరికిన‌ట్టే ఉతికి ఉతికి ఆరేశాడు.

సినిమా అంతా బోర్ అంటే.. మ‌ధ్య‌లో వ‌చ్చే పాట‌లు మ‌రీ విసిగిస్తాయి. `ఈ సెట్యువేష‌న్‌లో పాటొస్తే.. క‌థ‌కి అడ్డ‌మేమో..` అని ఓ పాట‌కు ముందు హీరో హీరోయిన్ల చేత చెప్పిస్తాడు ద‌ర్శ‌కుడు. అలా అన్న‌వెంట‌నే ఓ పాటొచ్చేస్తుంది. అంటే ద‌ర్శ‌కుడు తెలిసి తెలిసి త‌ప్పు చేశాడ‌న్న‌మాట‌. క‌ల్యాణి కోడూరి పాట‌లు సోసోగానే ఉన్నాయి. పాట‌లు వినడానికి ఒకే. చూడ్డానికే బోరింగ్‌. విందా ఫొటోగ్ర‌ఫీతో సినిమాకి రిచ్ రెస్ తీసుకొద్దామ‌నుకొన్నారు. అదీ వీలుకాలేదు. న‌రేష్ కి ఇది సూట‌వ్వ‌ని పాత్ర‌. అటు త‌న శైలి కామెడీ కూడా పూర్తిగా మిస్స‌య్యింది. ఈషా గురించి చెప్పుకోవ‌డానికి ఏం లేదు. భ‌ర‌ణి.. గెట‌ప్ వికృతంగా ఉంది. తొలిసారి భ‌ర‌ణి కూడా బోర్ కొడ‌తాడు. సంపూ, అవ‌స‌రాల‌, స‌ప్త‌గిరి ఉన్నా న‌వ్వుల్లేవు. పోసాని, రావు ర‌మేష్‌ల‌దీ రొటీన్ న‌ట‌నే.

క్లుప్తంగా చెప్పాలంటే... బందిపోటు ఓ వృథా ప్ర‌యాస‌. న‌రేష్ సినిమా అంటే కామెడీ ఆశించి వెళ్లేవారికి ఈ సినిమాని పూర్తిగా నిరుత్సాహ‌ప‌రుస్తుంది. పోనీ.. ఇంద్ర‌గంటి శైలిలో క్లాస్‌గానైనా ఉందా అంటే అదీ లేదు. రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.