English | Telugu
'తుంగభద్ర'ను చూసిన బాలయ్య
Updated : Mar 17, 2015
రాజకీయాలు, సినిమాలతో బిజీగా గడుపుతున్న నందమూరి బాలయ్యకు కొంచెం ఖాళీ సమయం దొరకడంతో సినిమా చూడాలని డిసైడ్ అయ్యారట. తన లెజెండ్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి నిర్మించిన 'తుంగభద్ర' సినిమా కథ నచ్చడంతో తాను ఫ్యామిలీతో సహా చూస్తానని అన్నారట. దీంతో ఆయన బాలయ్య కోసం ప్రత్యేకంగా షో అరేంజ్ చేసారట. సినిమా చూసిన బాలయ్య, టేకింగ్ ను, కొత్త దర్శకుడిని తెగ మెచ్చుకున్నారట. మంచి సినిమాను నిర్మించావని నిర్మాత సాయి కొర్రపాటిని తెగ పొగిడేశారట. బాలయ్య అంతటి వాడు కితాబు ఇచ్చేసరికి సాయి కొర్రపాటి సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ గా వున్నాడట. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దం చేస్తున్నాడు.