English | Telugu

బాలయ్య న్యూమూవీ లుక్ ఇదే..!

'లెజెండ్' తరువాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని బైక్ చేజింగ్, కార్ బ్లాస్టింగ్ సన్నివేశాలను హైదరాబాద్ ఔటర్ రింగ్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సమయంలో బాలయ్యను చూసిన అభిమానులు ఆయనతో కరచాలనం చేయడానికి, ఫోటోలు దిగడానికి పోటీబడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ నెట్ వర్క్ సైట్ లలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోలో బాలయ్య మాస్ లుక్ చూసి నందమూరి అభిమానులు తెగ స౦బరపడుతున్నారు. 'లెజెండ్' కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వలని కోరుకుంటున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.