English | Telugu

బాహుబ‌లి సెట్లో.. స‌మ్మె సైర‌న్‌

ఫెడ‌రేష‌న్‌కీ, ఫిల్మ్‌ఛాంబ‌ర్‌కీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్లేదు. దాంతో ఎక్క‌డి షూటింగులు అక్క‌డే బంద్ అయ్యాయి. ''మా జీతాలు డ‌బుల్ చేయాల''ని ఫెడ‌రేష‌న్ - అది మా వ‌ల్ల కాద‌ని నిర్మాత‌లు గ‌త వారం రోజులుగా వాదించుకొంటున్న సంగ‌తి తెలిసిందే. దాంతో కార్మికులు స‌మ్మెకు దిగారు. కార్మికుల అభ్య‌ర్థ‌న ప్ర‌కారం జీతాలు పెంచి త‌మ షూటింగుకి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకొంది బాహుబ‌లి టీమ్‌. అయితే ఇప్పుడా ప‌ప్పులు ఉడ‌క‌డం లేదు. బాహుబ‌లి షూటింగ్‌ని కూడా ఆపాల‌ని ఫెడ‌రేష‌న్ పిలుపునిచ్చింది. సినిమాని బట్టి వేతనాలు అందుకోవ‌డం స‌రికాద‌ని, అంద‌రికీ ఒకే నియ‌మం వ‌ర్తించాల‌ని ఫెడ‌రేష‌న్ స‌భ్యులు వాదిస్తున్నారు. దాంతో రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతున్న బాహుబ‌లి షూటింగ్ కూడా హ‌ఠాత్తుగా ఆగిపోయింది. ఈరోజు సాయింత్రం ఫెడ‌రేష‌న్ కీ, నిర్మాత మండ‌లికీ మ‌ధ్య కీల‌క‌మైన స‌మావేశం ఉంది. అక్క‌డ తీసుకొనే నిర్ణ‌యాల‌ను బ‌ట్టే.. షూటింగులెప్పుడ‌నేది తెలుస్తుంది. గోవా వెళ్లిన పూరి బృందం కూడా ఫెడ‌రేష‌న్ పిలుపు మేర‌కు షూటింగుల‌ను అర్థాంత‌రంగా ఆపేసి తిరిగొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ బాహుబ‌లిపైనా ప‌డింద‌న్న‌మాట‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.