English | Telugu

మా ఆయ‌న మొహం చూళ్లేదంటున్న స్వాతి

తెలుగు పిల్ల స్వాతి ఇప్పుడు అనుదినం వార్త‌ల్లో ఉంటోంది. సినిమాలెక్కువై కాదు. ఆమెపై పుకార్లు పెరిగి. ఓ యువ హీరోతో బాగా స‌న్నిహితంగా ఉంటోంద‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతోందనే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఆ హీరో ఎవ‌రో కాదు. నిఖిల్‌. స్వామి రారాతో ఇద్ద‌రూ తెర‌పై క‌నిపించారు. ఇప్పుడు కార్తికేయ‌లోనూ ఈ జోడీనే చూడ‌బోతున్నాం. వ‌రుస‌గా రెండు సినిమాల్లో న‌టించేశారు క‌దా.. అందుకే ఈ ర‌కం వార్తలు వ‌రుస క‌డుతున్నాయి. వాటిపై స్పందించింది స్వాతి. ''స్వాతి పెళ్లి చేసుకొంటోందోచ్‌.. అనే వార్త‌లు నేనూ విని షాకైపోయా. అస‌లు నాకు కాబోయే భ‌ర్త మొహం నేనే చూళ్లేదు. మీడియావాళ్లు మాత్రం క‌థ‌లు, కూర‌లు వండేస్తున్నారు..' అంటూ త‌న‌దైన స్టైల్‌లో న‌వ్వేసింది స్వాతి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజం లేదా...?? అని అడిగితే ''ఏమాత్రం లేదు. నేను ఎవ‌రి ప్రేమ‌లో ప‌డ‌లేదు. ఇంట్లోవాళ్లు కూడా పెళ్లి ఊసెత్త‌డం లేదు. ఇక నిఖిల్ మ్యాట‌రంటారా...?? మేమిద్ద‌రం క‌ల‌సి రెండు సినిమాలు చేశాం. అంత‌కంటే కార‌ణం ఏం కావాలి? ఇద్ద‌రూ ఓసారి రెస్టారెంట్‌కి వెళ్లి భోజ‌నం కూడా చేశాం. అందుకే ఈ పుకారు పుట్టుంటుంది'' అంటోంది స్వాతి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.