English | Telugu

అల్లు అర్జున్ బద్రీనాథ్ ఆడియో మే 8 న రిలీజ్

అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం ఆడియో "మే" నెలలో విడుదల కానుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్‍ స్టార్ అల్లు అర్జున్‍ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం " బద్రీనాథ్ ". అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం ఆడియో "మే" నెలలో ఎనిమిదవ తేదీన రిలీజ్ కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. అల్లు అర్జున్ తొలి చిత్రం "గంగోత్రి" చిత్రానికి కథను అందించిన ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రానికి కూడా కథనందించటం విశేషం.

ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రానికి యమ్.యమ్.కీరవాణి సంగీతాన్ని అందించారు. అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రంలో ఇంకా రెండు పాటలు కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రంలో హీరో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా నటించారు. ఈ సమురాయ్ పాత్ర పోషిచటానికి అల్లు అర్జున్, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తో కలసి విదేశాలకు వెళ్ళి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం "మే" నెల మూడవ వారంలో కానీ లేదా జూన్ మూడవ తేదీన కానీ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.