English | Telugu

TFJA ఉచిత ఐ స్క్రీనింగ్ క్యాంప్ కు విశేష స్పందన!

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 26 న) ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం చాంబర్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించాయి. జర్నలిస్టులకు 'ఐ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాక్టర్ ప్రియదర్శి, ప్రొడ్యూసర్ నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రియదర్శి, నాగ వంశీ రిబ్బన్ కట్ చేసి హెల్త్ క్యాంప్ ప్రారంభించగా... అనంతరం ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిక్ హెడ్ విశ్వమోహన్, TFJA ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రఘు, జనరల్ సెక్రటరీ వై.జె. రాంబాబు చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన జరిగింది.

హెల్త్ క్యాంప్‌లో భాగంగా ప్రియదర్శి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన చూపు పర్ఫెక్ట్ ఆల్ రైట్ అని వైద్యులు తెలిపారు. హెల్త్ క్యాంప్ గురించి ప్రియదర్శి మాట్లాడుతూ... ''తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌కు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంప్ నిర్వహిస్తున్న అసోసియేషన్ పెద్దలకు, ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాష్ చుక్కపల్లి గారికి, శంకర్ ఐ హాస్పిటల్ మోహన్ గారికి థాంక్స్. జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటున్న అసోసియేషన్ పెద్దలకు స్పెషల్ థాంక్స్. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి'' అని చెప్పారు.

శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన 'ఐ స్క్రీనింగ్' హెల్త్ క్యాంప్‌లో‌ జర్నలిస్టులు, వాళ్ల కుటుంబ సభ్యులు 100 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .