English | Telugu
ఆహా ఇద్దరితో రొమాన్స్... భలే ఛాన్సులే...!
Updated : Feb 26, 2014
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో రొమాన్స్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ మళ్లీ పాత ప్రియుడు రణవీర్ సింగ్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది. కొద్దికాలం ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ కూడా విడిపోయారు. అయితే అనుష్క, రణవీర్ లతో కలిసి బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ "దిల్ ధడక్‌నే దో" అనే సినిమా ప్లాన్ చేసింది. ఈ సినిమా గురించి వీరిద్దరిని ఒప్పించి ప్రాజెక్ట్ ఓకే చేయించిందట. ప్రేమ, రొమాన్స్ ఎక్కువగా ఉంటాయట. అంటే మళ్ళీ ఈ అమ్మడు రణవీర్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యిందని బాలీవుడ్ గుసగుసలు పెడుతున్నాయి. మరి వీరి రొమాన్స్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.