English | Telugu
తీవ్ర విషాదంలో యాంకర్ ఝాన్సీ.. ఇది ఆమెకి కోలుకోలేని దెబ్బే
Updated : Nov 8, 2023
బుల్లి తెర, వెండి తెర రెండింటిలోను తనదయిన శైలిలో నటిస్తూ ముందుకు దూసుపోయే నటీమణి ఝాన్సీ. దాదాపుగా టెలివిజన్ రంగం పుట్టినప్పటినుంచే ఝాన్సీ ఎన్నో ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తు వస్తున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ పలువురిని కంటతడిపెట్టిస్తుంది.
ఝాన్సీ దగ్గర హెయిర్ స్టైలిస్ట్ గా పని చెయ్యడం ప్రారంభించి ఆవిడ పర్సనల్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన వ్యక్తి శ్రీను. తాజాగా కార్డియాక్ అరెస్ట్ వలన శ్రీను చనిపోయాడు. ఈ విషయం గురించే ఝాన్సీ తన ట్విటర్ లో శ్రీను ఫోటో ని పోస్ట్ చేసి శ్రీను తనకి ఎంత కావలసిన వ్యక్తో చెప్పింది. శ్రీను నాకు తమ్ముడు లాంటి వాడు ఎప్పుడు నవ్వుతు సరదాగా ఉండే శ్రీను 35 సంవత్సరాల వయసులో చనిపోవడం నాకు నిజంగా బాధగా ఉందనిచెప్పింది.
శ్రీను కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు నా ఆలోచన, నా ఉపశమనం,నా వర్క్ బ్యాలన్స్ ,నా తెలివి ఇలా నా పూర్తి బలం శ్రీను నే . అలాగే శ్రీను చాలా సున్నితమైన వ్యక్తి ఇంత చిన్న వయసులో శ్రీను చనిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ సమయంలో నాకు మాటలు కూడా రావడం లేదు, శ్రీను మరణంతో జీవితం ఒక నీటి బుడగ అని మరోసారి అర్ధం అయ్యిందని బాగా ఎమోషనల్ అవుతు ఝాన్సీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.