English | Telugu

కోరిక తీర్చుకున్న బన్నీ లవర్

గ్లామర్ పాత్రలో కవ్వించిన, చీరకట్టులో మురిపించిన అది కేవలం అమలాపాల్ కె దక్కింది. అమలాపాల్ అనగానే మొన్నటి వరకు గ్లామర్ పాత్రలే గుర్తొచ్చేవి. కానీ ఇటీవలే విడుదలైన "ఇద్దరమ్మాయిలతో" చిత్రంలో చీరకట్టులో కనిపించి యువకుల డ్రీం గర్ల్ గా మారిపోయింది. మరీ ఇంత అందంగా ఉంటే ఎలా చెప్పండి? అసలు ఇదంతా ఎలా జరిగిందని అమలాపాల్ ను అడిగితే ఏం చెబుతుందంటే....!

సినిమాల్లోకి....

మాది కేరళలోని కొచ్చి. అమ్మ అన్నీస్ పాల్, నాన్న వర్గీస్ పాల్, అన్నయ్య అభిజిత్. బి.ఎ. (కమ్యునికేటివ్ ఇంగ్లీష్) చదివే సమయంలో సరదాగా మోడలింగ్ చేసి, ముంబాయి ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై నడిచానంతే... ఇంకేముంది ఫోటోలు బయటకు రావడం, అవి చూసి నిర్మాతలు అవకాశాలు ఇవ్వడానికి మా ఇంటికి రావడం జరిగాయి. ఛాన్స్ ఐతే ఇచ్చాం కదా అన్నట్లుగా స్క్రిప్ట్ కూడా సరిగ్గా విననివ్వకుండానే నా మొదటి రెండు సినిమాలు తీసేశారు. 1.నీలి తామర (మలయాళం), 2. వీరశేఖరన్(తమిళం). ఈ సినిమాలైతే అంతగా అడలేవు కానీ నాకు కెమేరా అనుభవం తెలిసింది. ఆ తర్వాత వచ్చిన "మైన"(తెలుగులో ప్రేమఖైదీ) చిత్రం విడుదలై సూపర్ హిట్టవడంతో తెలుగు, తమిళ భాషలలో అనేక అవకాశాలు వచ్చాయి. ఈ చిత్రానికి నాకు 4 అవార్డులు వచ్చాయి.

తెలుగులో...

ఈ చిత్రం తర్వాత తెలుగులో "బెజవాడ" నా మొదటి తెలుగు చిత్రం. తర్వాత "లవ్ ఫెయిల్యూర్", "నాయక్", "ఇద్దరమ్మాయిలతో" చిత్రాలలో నటించాను. కానీ ఇటీవలే విడుదలైనా "ఇద్దరమ్మాయిలతో" చిత్రంలో సాంప్రదాయమైన తెలుగు అమ్మాయిల కనిపించేసరికి ప్రేక్షకులకు చాలా బాగా నచ్చేసింది. కానీ ఈ సినిమాలో డాన్స్ చేయడానికి నాకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో... బన్నీ-పూరీ సహాయంతో చివర్లో టాప్ లేపేసే సాంగ్ లో డాన్స్ చేసి నా కోరిక తీర్చుకున్నాను. ప్రస్తుతం నానితో కలిసి "జెండాపై కపిరాజు" చిత్రంలో నటిస్తున్నాను.

నచ్చే నటులు...

విక్రమ్, సిద్దార్థ్, సూర్య, కార్తీ, బన్నీ, శ్రీదేవి, ఐశ్వర్యరాయ్... అబ్బో ఇంకా చాలా మందే ఉన్నారు.

హాబీలు...

ఫోటోగ్రఫి అంటే చాలా ఇష్టం. మగ్జిన్స్ చదవడం, సినిమాలు చూడటం, డాన్స్ చేయడం.

ప్రేమ....

డిగ్రీలో ఉన్నప్పుడు ప్రేమించడం, విడిపోవడం జరిగిపోయాయి. ఇపుడు మాత్రం అలాంటివేమి లేవు.

ఇష్టమైన ఆహరం...

కొత్త రుచులన్ని నచ్చుతాయి. ఎక్కువగా సీ-ఫుడ్ తింటాను. ఇంకా చికెన్, పొంగళ్ ఇష్టం.

N.S.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.