English | Telugu

బాహుబలి వర్సెస్ గోన గన్నారెడ్డి

దీపావళి కానుకగా విడుదలైన అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డి గెటప్‌, ప్రభాస్ బాహుబలి పోస్టర్‌ లు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా పదునైన చూపులతో ఓ అగ్గి బాణం వదులుతూ సూపర్బ్ అనిపిస్తున్నాడు బన్నీ. అలాగే బహుబలిలో కండలు తిరిగిన శరీరంతో యుద్ధ భూమిలో అర్జునుడులా బాణం సందిస్తూ అదరహో అనిపిస్తున్నాడు ప్రభాస్. బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ది మెయిన్‌ రోల్‌. అల్లు అర్జున్‌ది ‘రుద్రమదేవి’లో కేవలం గెస్ట్‌ అప్పీయరెన్స్‌ మాత్రమే. అయినా రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్‌, ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ గెటప్ లు పోటా పోటీగా కన్పిస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరి గెటప్ మీరు బెస్ట్ అంటారు?