English | Telugu

అల్లు అర్జున్ పెళ్ళికి రానున్న అమీర్ ఖాన్

ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ వివాహం స్నేహా రెడ్డితో హైదరాబాద్ లోని హైటెక్స్ లో 2011 మార్చ్ 5 వ తేదీన జరుగనుంది.ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహానికి, వారిని ఆశీర్వదించటానికి వస్తున్న టాలీవుడ్, కోలీవుడ్, వంటి దక్షిణాది సినీ ప్రముఖులతో పాటు హైదరాబాద్ కి రానున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ పెళ్ళికి కాస్త ముందుగా హైదరాబాద్ వస్తున్న అమీర్ ఖాన్ హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో దిగుతారు.గతంలో తమిళ, తెలుగు భాషల్లో దిగ్విజయం సాధించిన "గజిని" చిత్రాన్ని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ పతాకంపై, అల్లు అరవింద్ "గజిని" పేరుతో నిర్మించగా అది అద్భుతమైన విజయం సాధించింది.ఆ అనుబంధంతో అమీర్ ఖాన్ ఇప్పుడీ వివాహానికి హాజరవుతున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.