English | Telugu

ఆది, వరుణ్ సందేశ్ ల మధ్య అప్పల్రాజు పచ్చడే

ఆది ప్రముఖ సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు.వరుణ్ సందేశ్ వర్థమాన యువ హీరో.వీళ్ళిద్దరి మధ్య పాపం రామ్ గోపాల వర్మ తీసిన అప్పల్రాజు పచ్చడవుతాడని సినీ వర్గాల భోగట్టా.అంటే కె.విజయభాస్కర్ దర్శకత్వంలో,.అచ్చిరెడ్డి నిర్మిస్తుండగా,ఆది తొలిసారి హీరోగా నటిస్తున్న "ప్రేమ కావాలి"చిత్రం ఫిబ్రవరి 25 వ తేదీన విడుదలవుతోంది.అలాగే సినిమాటోగ్రాఫర్ రమణ సాల్వని దర్శకుడిగా పరిచయం చేస్తూ,వరుణ్ సందేశ్ హీరోగా, సుమా భట్టాచార్యను హీరోయిన్ గా పరిచయం చేస్తూ,మహి, శివ నిర్మిస్తున్న చిత్రం"కుదిరితే కప్పుకాఫీ" కూడా అదే రోజున విడుదలవుతోంది.ఇప్పటికే రెండు రోజుల బంద్ కారణంగా నీరసపడిన "అప్పల్రాజు", ఈ రెండు చిత్రాల విడుదల కారణంగా కోలుకోవటం కాదుగదా పూర్తిగా దుంపనాశనం అవటం ఖాయమని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఎందుకంటే పై రెండు చిత్రాలూ రెండు విభిన్నమైన జోనర్స్ కు చెందినవి కాబట్టి,అవి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు బాగా ఉన్నాయి కనుక అప్పల్రాజు పరిస్థితి పచ్చడేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.