English | Telugu
బన్నీ, బోయపాటి సినిమా లాంచ్ డేట్
Updated : Jun 10, 2015
బన్నీ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం ఈ నెల 12 ప్రారంభం కాబోతోంది. నిజానికి అప్పుడెప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది. అసలు ఈ మూవీ ఉంటుందా, లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రీసెంట్ గా బోయపాటి బర్త్ డేను స్వయంగా అల్లు అర్జున్ సెలబ్రేట్ చేయడంతో ఈ మూవీపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
బోయపాటి గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా హై వోల్టేజ్ యాక్షన్ స్టోరీ కావడంతో పాటు.. ప్రేమకథ కూడా మిళితమై ఉందట. ఈ సినిమాలో బన్నీకి జంటగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారని సమాచారం.