English | Telugu
ఎన్టీఆర్ సినిమాపై షాకింగ్ న్యూస్
Updated : Jun 11, 2015
మహేష్‌బాబుతో చేసిన `వన్` ప్రయోగం విఫలం అవ్వడంతో... ఎన్టీఆర్ సినిమాపైనే హోప్స్ పెట్టుకొన్నాడు సుకుమార్. అయితే ఈ సినిమా మొదలవ్వకుండానే ఎన్టీఆర్ సుకుమార్ చేతులు కట్టేసే ప్రయత్నాల్లో పడ్డాడని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
ఈ విషయంలోనే ఎన్టీఆర్ - సుకుమార్‌ల మధ్య ఈగో సమస్యలొచ్చాయని, వాటితోనే ఈ సినిమా ఆగిపోయే ప్రమాదంలో పడిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతని మార్చే విషయంలో ఎన్టీఆర్, సుకుమార్‌ల మధ్య తీవ్రమైన చర్చసాగిందట. నిర్మాతని మార్చాలని ఎన్టీఆర్, అవసరం లేదని సుకుమార్ వాదించుకొన్నారట. ఓ దశలో ఈ సినిమా నేను చేయను.. అని సుక్కు అలిగాడట.
ఆ దశలోనే ఎన్టీఆర్ - త్రివిక్రమ్‌ల సినిమా గురించిన వార్తలొచ్చాయి. సుకుమార్ సినిమాని తాత్కాలికంగా పక్కన పెట్టి, త్రివిక్రమ్‌తో ప్రొసీడ్ అయిపోదామనుకొన్నాడు ఎన్టీఆర్. కానీ... తనని కాస్త సర్దిచెప్పుకొని మళ్లీ సుకుమార్‌తోనే ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్టీఆర్ సుకుమార్‌ని కోరాడట. కేవలం రెండు షెడ్యూళ్లలోనే ఈ సినిమా పూర్తి చేసిస్తానని సుక్కు కూడా మాటిచ్చినట్టు తెలుస్తోంది. ఆ ప్రకారమే ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కిందట. లేదంటే... ఈసినిమా మొదలవ్వకుండానే ఆగిపోయేది.
ఇద్దరూ ఈగోల్ని పక్కన పెట్టి, ఓ మంచి సినిమా కోసం కలసి కష్టపడితే... బాక్సాఫీసుకీ, ఎన్టీఆర్ అభిమానులకు అంతకంటే కావల్సింది ఏముంది?