English | Telugu

పుష్ప-2 రేంజ్ పెరిగింది.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 రికార్డ్స్ జుజుబి!

మరో ఏడాది ఏడాదిన్నర లోపు వచ్చే సినిమాలలో రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగల సత్తా ఉన్న సినిమాలలో పుష్ప రెండో భాగంగా రానున్న పుష్ప: ది రూల్ ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమా వెయ్యి కోట్లు రాబడుతుందనే అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా రేంజ్ పెరిగిందని, 1500 కోట్లు రాబట్టినా ఆశ్చర్యంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప: ది రైజ్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా కేజీఎఫ్-1 ని మించిన విజయాన్ని అందుకుంది. నార్త్ లోనూ పుష్ప-1 కి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు పుష్ప-2 కి కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశముంది. వసూళ్ల పరంగా కేజీఎఫ్-2 ని మించిన విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కేజీఎఫ్ తో పోలిస్తే పుష్ప కి మ్యూజిక్, మ్యానరిజమ్స్ బిగ్ అసెట్. సెలబ్రిటీలు సైతం పుష్పరాజ్ మ్యానరిజమ్స్ కి ఫిదా అయ్యారు. ఆ లెక్కన కేజీఎఫ్-2 తరహాలో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం పుష్ప-2 కి పెద్ద మేటర్ కాదు. ఇప్పటికే పుష్ప-2 పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికితోడు తాజాగా పుష్ప-1 కి గానూ బెస్ట్ యాక్టర్ గా బన్నీ నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. దీంతో ఇప్పుడు పుష్పరాజ్ పేరు మారుమోగిపోతోంది. పుష్ప-2 రేంజ్ పెరగడంతో పాటు అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు పుష్ప-2 టార్గెట్ రూ.1000 కోట్లు కాదని, రూ.1500 కోట్లని అంటున్నారు. అదే జరిగితే వెయ్యి కోట్ల క్లబ్ లో ఉన్న కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలను దాటేసి.. సౌత్ నుంచి బాహుబలి-2 తర్వాత రూ.1500 కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమాగా నిలవనుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.