English | Telugu

అఖిల్ సినిమా లాంచ్ అయ్యింది

అక్కినేని అభిమానులు ఎప్పుడాని ఎదురుచూస్తున్న అఖిల్ సినిమా ఈ రోజు లాంచ్ అయ్యింది. ఈరోజు ఉద‌యం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో అఖిల్ సినిమా అధికారికంగా లాంఛ్ అయ్యింది ఈ విషయాన్ని అక్కినేని అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నేను హీరోగా పరిచయమవుతున్న సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. నా డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ & సుధాకర్ రెడ్డిలకు అల్ ది బెస్ట్. వీరితో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం అయినందుకు క్షమించండి.' అని అన్నారు. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానిన్ని నితిన్ సొంత సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ తెర‌కెక్కించ‌నుంది. క‌థానాయిక‌, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.