English | Telugu

రాజు వెడ్స్ రాంబాయి ఓటిటి డేట్ ఫిక్స్! మరి ఫ్యాన్స్ ఏమంటున్నారు

-ఇదేనా ఆ డేట్
-అదే అయితే ఫ్యాన్స్ హ్యాపీ
-థియేటర్స్ లో సంచలనం
-మరి ఓటిటి లో!

గత నెల నవంబర్ 21 న థియేటర్స్ లో అడుగుపెట్టిన మూవీ రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai). రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కగా అఖిల్ రాజ్, తేజస్విరావు జంటగా నటించారు. నటించారు అనే కంటే వాళ్లిదరు రాజు, రాంబాయి గా జీవించారని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి హృదయాల్ని తాకిన సినిమాగా కూడా నిలిచింది.ముఖ్యంగా క్లైమాక్స్ చూసి బయటకి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఓటిటి సినీ ప్రియులకి ఒక గుడ్ న్యూస్ వచ్చింది.

రాజు వెడ్స్ రాంబాయి ఓటిటి హక్కులు ఈటీవీ విన్(Etv Win)దగ్గర ఉన్నాయి. సదరు స్ట్రీమింగ్ ని డిసెంబర్ 19 నుంచి అందుబాటులోకి తీసుకొస్తునట్టుగా తెలుస్తోంది. నిజానికి తొలుత ఓ టిటి స్ట్రీమింగ్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో స్ట్రీమింగ్ కి వస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ నెల 19 నుంచే స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓటీటీ స్ట్రీమింగ్ పోస్టులు దర్శనమిస్తున్నాయి. మేకర్స్ అయితే ఈ డేట్ ని అధికారకంగా ప్రకటించలేదు.


Also read:రోషన్ కనకాల ఆశలని మోగ్లీ 2025 నెరవేర్చిందా! లేదా!

తెలంగాణ(Telangana)లోని ఖమ్మం జిల్లా ఇల్లెందు రూరల్ ఏరియాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రాజు వెడ్స్ రాంబాయి తెరకెక్కింది.మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని 17 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. సాయిలు(Saailu)దర్శకుడు కాగా చైతన్య జొన్నలగడ్డ నెగిటివ్ క్యారక్టర్ లో చెయ్యగా శివాజీ రాజా, అనిత చౌదరి కథ కి ముఖ్యమైన క్యారెక్టర్స్ ని పోషించి మూవీ విజయంలో కీలక పాత్రలు పోషించారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం