English | Telugu
బాలయ్య, బోయపాటి కాంబో పై అభిమానుల స్పందన ఇదే.. హిట్ కొట్టారా!
Updated : Dec 12, 2025
-కాంబో హిట్ అందుకుందా!
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-అఖండ 2 పరిస్థితి ఏంటి?
తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై బాలకృష్ణ(Balakrishna),బోయపాటి శ్రీను(Boyapati Srinu)కాంబోకి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆ ఇద్దరి నుంచి మూవీ వస్తుందంటే అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రమే కాదు అంచనాలు హై వోల్టేజ్ ట్రాన్స్ ఫార్మ్ రేంజ్ లో ఉంటాయి. అందుకే ఆ ఇద్దరి చిత్రం గత కాంబోలో వచ్చిన చిత్రాలని మించి ఉండటం కంపల్ సరి. అంచనాలని ఏ మాత్రం అందుకోలేకపోయినా ఫలితంలో తేడా వస్తుంది. అంతలా ఆ ఇద్దరే సెట్ చేసుకున్నారు. సింహ, లెజండ్, అఖండ వంటి చిత్రాలే ఉదాహరణ. ఇప్పుడు ఆ క్రేజ్ ని పాన్ ఇండియా వ్యాప్తంగా పెంచుకునేలా తమ కొత్త చిత్రం అఖండ 2 తో థియేటర్స్ లో అడుగుపెట్టారు. నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడంతో ఇప్పటికే అఖండ 2 టాక్ బయటకి వచ్చేసింది.
ఇక మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు బాలయ్య, బోయపాటి కాంబో పై ఎలాంటి అంచనాలు అయితే పెట్టుకొని థియేటర్ కి వెళ్ళామో అలాగే ఉంది. అంతకు మించి అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెల్యులాయిడ్ పై ఆ కాంబో ఒక కొత్త వండర్ ని క్రియేట్ చెయ్యడంతో పాటుకొత్త జోనర్ ని కూడా ఇండియన్ సినిమాకి పరిచయం చేసింది. ఆ కాంబోలో వచ్చిన గత చిత్రాలని మించి ఎక్కడ తగ్గకుండా అఖండ 2 బాగుంది. పైగా గత చిత్రాల నుంచి ఈ సారి పాన్ ఇండియా స్థాయిలో అత్యంత క్వాలిటీ తో తెరకెక్కించారు. అఖండ 2 తో మరో సారి బాలయ్య, బోయపాటి తమ కాంబో రేంజ్ ని మరింతగా పెంచుకున్నారు. తదుపరి చిత్రం అఖండ 2 ని మించి తెరకెక్కించాలని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also read:అఖండ 2 లో ప్రధాన హైలెట్స్ ఇవే.. అందుకే ఇంకోసారి చూస్తామంటున్నారు
ఇక ఎక్కువ శాతం రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తుండటంతో ఇప్పుడు అఖండ 2 సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.